Share News

సోలార్‌ ప్రాజెక్టుకు 1500 ఎకరాలు

ABN , Publish Date - Feb 18 , 2026 | 12:43 AM

ఇటీవల జరిగిన క్యాబినెట్‌లో ఆమోదం పొందిన జిల్లాలోని సంజామల మండలం నొసం గ్రామంలోని సర్వే నెంబరు 1409-5 లోని 1500 ఎకరాలను 250 మెగావాట్ల సౌర విద్యుత ప్రాజెక్టు కోసం అప్పగిస్తూ ప్రభుత్వ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

సోలార్‌ ప్రాజెక్టుకు 1500 ఎకరాలు

నెడ్‌క్యాప్‌ సంస్థకు అప్పగింత

నంద్యాల, ఫిబ్రవరి17(ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన క్యాబినెట్‌లో ఆమోదం పొందిన జిల్లాలోని సంజామల మండలం నొసం గ్రామంలోని సర్వే నెంబరు 1409-5 లోని 1500 ఎకరాలను 250 మెగావాట్ల సౌర విద్యుత ప్రాజెక్టు కోసం అప్పగిస్తూ ప్రభుత్వ ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ప్రభుత్వ లీజు 30 ఏళ్ల వరకు అమలులో ఉండటంతో పాటు ఎకరాకు ఏడాదికి రూ.31,000 చొప్పున సదరు సంస్ధ ప్రభుత్వానికి చెల్లించనుంది. అదేవిధంగా ఇచ్చిన లీజుపై ప్రతి రెండేళ్లకు ఒకసారి 5శాతం పెంచి సదరు సంస్థ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఏది ఏమైనా సదరు సోలార్‌ ప్రాజెక్టు పూర్థైయితే స్థానికంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలగనుంది.

Updated Date - Feb 18 , 2026 | 12:43 AM