14 మంది ప్రాణాలు కాపాడిన ‘పింఛన్’
ABN , Publish Date - Mar 02 , 2026 | 04:11 AM
కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాద ఘటన నుంచి 14 మంది కూలీలు ‘పిం ఛన్’ కారణంగా ప్రాణాలు కాపాడుకున్నారు.
28వ తేదీన వేట్లపాలెం బాణసంచా కేంద్రానికి పనులకు వెళ్లకుండా ఆగిపోయిన కూలీలు
అదే రోజు బాణసంచా కేంద్రంలో ప్రమాదం
సామర్లకోట, మార్చి 1(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాద ఘటన నుంచి 14 మంది కూలీలు ‘పింఛన్’ కారణంగా ప్రాణాలు కాపాడుకున్నారు. ఇతర కూలీల మాదిరే వీరు కూడా శనివారం బాణసంచా తయారీ కేంద్రానికి పనికి వెళ్లాల్సివుంది. అయి తే ఆ రోజు సామాజిక పింఛన్లు పంపిణీ చేయడంతో లబ్ధిదారులైన ఈ 14 మంది పనికి వెళ్లలేదు. కూటమి ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తున్న తెలిసిందే. మార్చి 1వ తేదీ ఆదివారం సెలవు రోజు కావడంతో ఫిబ్రవరి 28వ తేదీ(శనివారం)నే పింఛన్లు అందజేశారు. వేట్లపా లెం బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేస్తున్నవారిలో 14 మంది కూలీలు పింఛన్లు తీసుకోవడం కోసం శనివారం పనికి వెళ్లేలేదు. పింఛన్లు తీసుకుని ఇళ్ల దగ్గరే ఉండిపోయారు. అదేరోజు బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన విస్ఫోటంలో 23 మంది కూలీలు మరణించారు. ఆ రోజు కూలి పనులకు ఈ 14 మంది వెళ్లకపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.