Share News

విద్యుత్తు రంగానికి రూ.13,934 కోట్లు

ABN , Publish Date - Feb 15 , 2026 | 04:44 AM

వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు, ఆక్వా రంగానికి సబ్సిడీ విద్యుత్తును అందించడమే ప్రాధాన్యంగా విద్యుత్తు రంగానికి రూ.13,934.25కోట్లు కేటాయించారు.

విద్యుత్తు రంగానికి రూ.13,934 కోట్లు

ఇంటర్నెట్ డెస్క్ : వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు, ఆక్వా రంగానికి సబ్సిడీ విద్యుత్తును అందించడమే ప్రాధాన్యంగా విద్యుత్తు రంగానికి రూ.13,934.25కోట్లు కేటాయించారు. గతేడాది కన్నా ఇది 334.25 కోట్లు ఎక్కువ. 49,200 మంది ఆక్వా రైతులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఆక్వా రంగానికి సబ్సిడీ విద్యుత్‌ కోసం రూ.890 కోట్లు కేటాయించారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తుకుగాను వ్యవసాయ, అనుబంధ రంగాలకు సబ్సిడీ రూ.12,832 కోట్లు కేటాయించారు. దీంతో 21,86,922 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. విద్యుత్తు ప్రమాదాలపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ సేఫ్టీకి రూ.10 కోట్లు కేటాయించారు. నిరంతర విద్యుత్తు సరఫరా కోసం తుంగభద్ర హైడ్రో ఎలక్ట్రిక్‌ స్కీమ్‌ నిర్వహణ, విద్యుత్తు ఉత్పత్తి కోసం రూ.42 కోట్లు కేటాయించారు.

Updated Date - Feb 15 , 2026 | 04:45 AM