బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్‌కు 135 కోట్లు
ABN , Publish Date - Feb 27 , 2026 | 04:47 AM
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు సాస్కీ నుంచి రూ.135 కోట్లు కేటాయించామని...
అమరావతి, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు సాస్కీ నుంచి రూ.135 కోట్లు కేటాయించామని, ఆర్థిక శాఖ వద్ద రూ.445 కోట్లతో రివైజ్డ్ ఎస్టిమేషన్స్ వేశామని మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెలిపారు. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ పనులు చేపట్టే అవకాశం ఉందా? అని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. చింతపల్లిలొ ఫిష్‌ల్యాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.చింతపల్లి ప్రాంతంలో జెట్టీ ఏర్పాటుకు కమిటీ భూమిని పరిశీలించిందని, వెంటనే జెట్టి ఏర్పాటు చేయాలని మాధవి కోరారు.