Share News

రైల్లో తరలిస్తున్న 13 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:46 AM

గుట్టుచప్పుడు కాకుండా ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తరలిస్తుండగా ఈగల్‌ బృందం బుధవవారం తనిఖీలు చేపట్టి 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది.

రైల్లో తరలిస్తున్న 13 కిలోల గంజాయి స్వాధీనం

ఒంగోలు క్రైం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): గుట్టుచప్పుడు కాకుండా ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తరలిస్తుండగా ఈగల్‌ బృందం బుధవవారం తనిఖీలు చేపట్టి 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఒంగోలు రైల్వేస్టేషన్‌ నుంచి కావలి వరకు ఈగల్‌ టీమ్‌ రైలులో తనిఖీలు చేపట్టింది. అనుమానాస్పదంగా ఉన్న జార్ఖండ్‌ రాష్ర్టానికి చెందిన ముగ్గురు, ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 13 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం నిందితులను ఒంగోలు జీఆర్‌పీ పోలీసులకు అప్పగిస్తున్నట్టు ఈగల్‌ టీమ్‌ సీఐ సుధాకర్‌ తెలిపారు.

Updated Date - Mar 26 , 2026 | 03:46 AM