Share News

తిరుమలలో భారీ కొండ చిలువ

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:12 AM

తిరుమలలో బుధవారం ఓ భారీ కొండ చిలువ పట్టుబడింది. సుమారు 12 అడుగుల పొడవైన కొండ చిలువ ధర్మగిరి వేదపాఠశాలలోకి చొరబడింది.

తిరుమలలో భారీ కొండ చిలువ

తిరుమలలో బుధవారం ఓ భారీ కొండ చిలువ పట్టుబడింది. సుమారు 12 అడుగుల పొడవైన కొండ చిలువ ధర్మగిరి వేదపాఠశాలలోకి చొరబడింది. ఉపాధ్యాయులుండే గదుల సమీపానికి పాము రావడాన్ని గుర్తించి వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి భాస్కర నాయుడుకి సమాచారమిచ్చారు.ఆయన హుటాహుటిన అక్కడికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకుని దట్టమైన అడవిలో విడిచిపెట్టాడు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 04 , 2026 | 05:15 AM