డిప్యూటీ కలెక్టర్ ఖాళీలు 116
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:18 AM
రాష్ట్రంలో నాలుగేళ్లలో 116 డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్-1) ఖాళీలు ఏర్పడ్డాయని రెవెన్యూ శాఖ ప్రకటించింది.
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాలుగేళ్లలో 116 డిప్యూటీ కలెక్టర్ (గ్రూప్-1) ఖాళీలు ఏర్పడ్డాయని రెవెన్యూ శాఖ ప్రకటించింది. డిప్యూటీ కలెక్టర్ల సీనియారిటీ కోసం రెగ్యులర్ ప్యానల్స్‌ను సిద్ధం చేసే క్రమంలో ఈ ఖాళీలను గుర్తించినట్లు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో డిప్యూటీ కలెక్టర్‌లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు పనిచేస్తున్నారు. ఇందులో ఏపీపీఎస్సీ ద్వారా నియమితులయ్యే డైరెక్ట్ రిక్రూటీలు, ప్రమోట్ అయ్యేవారు ఉంటారు. వారి సీనియారిటీ ప్యానల్స్‌ను సిద్ధం చేసే క్రమంలో సంవత్సరం వారీగా ఉద్యోగ ఖాళీలను గుర్తిస్తుంటారు. 2019-20 నుంచి 2022-23 సంవత్సరాల వ్యవధిలో 116 ఖాళీలు ఉన్నట్లుగా రెవెన్యూ శాఖ లెక్కలు చూపింది. నిజానికి ఇందులో చాలా పోస్టులు ప్రమోటీ అధికారులతో నింపేశారు. వీటిలో డైరెక్ట్ రిక్రూటీ కోటా పోస్టులు ఎన్నో తేల్చాల్సి ఉం ది. అయితే, ఆ నాలుగేళ్ల వ్యవధిలో 116 పోస్టులు ఖాళీలు ఏర్పడినట్లుగా రెవెన్యూ శాఖ చెబుతోంది.