Share News

11,337 హెక్టార్లలో పంట నష్టం

ABN , Publish Date - Mar 23 , 2026 | 04:31 AM

గతవారంలో సంభవించిన అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 11,337 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ...

11,337 హెక్టార్లలో పంట నష్టం

  • వ్యవసాయ, ఉద్యానశాఖల డైరెక్టర్‌ శ్రీనివాసులు

అమరావతి, మార్చి 22(ఆంధ్రజ్యోతి): గతవారంలో సంభవించిన అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగళ్ల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 11,337 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ, ఉద్యానశాఖల డైరెక్టర్‌ శ్రీనివాసులు తెలిపారు. 15 జిల్లాలకు చెందిన 9,950 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 9 జిల్లాలకు చెందిన 1,387 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించామని ఆదివారం వెల్లడించారు. వరి 2,650 హెక్టార్లు, మొక్కజొన్న 6,450, మినుముకు 485 హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. ప్రధానంగా ఎన్టీఆర్‌, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో వ్యవసాయ పంటలు, ఎన్టీఆర్‌, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అరటి, మామిడి, నిమ్మ, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని వివరించారు.

Updated Date - Mar 23 , 2026 | 04:32 AM