1.11 కోట్ల మంది చిన్నారులకు ఆల్బెండజోల్
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:37 AM
నులిపురుగుల నివారణకు రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా ఇవ్వాలని ఆరోగ్యశాఖ..
అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): నులిపురుగుల నివారణకు రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా ఇవ్వాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుందని ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 17న మాత్రల పంపిణీ చేస్తామన్నారు. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు ఉన్న 1,11,63,762 మందికి ఈ మాత్రలు ఉచితంగా ఇస్తామని చెప్పారు.