1.10 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు: గొట్టిపాటి
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:39 AM
రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కోసం కూటమి ప్రభుత్వం రూ.13,722 కోట్లు ఖర్చు చేస్తోందని ఇంధనశాఖ మంత్రి ...
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించడం కోసం కూటమి ప్రభుత్వం రూ.13,722 కోట్లు ఖర్చు చేస్తోందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అలానే రైతుల కోసం ఇప్పటివరకు 1.10 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ, పామాయిల్ తోటల్లో విద్యుత్తు లైన్ల వల్ల జరిగే ప్రమాదాలపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి సమాధానం ఇచ్చారు. గోపాలపురం నియోజకవర్గంలో 177 ట్రాన్స్‌ఫార్మర్లు పంపిణీ చేశామన్నారు.