వాట్సాప్‌కు టెన్త్ రీవెరిఫికేషన్ పత్రాలు
ABN , Publish Date - May 18 , 2026 | 05:09 AM
పదో తరగతి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల వివరాలను నేరుగా విద్యార్థుల వాట్సాప్ కు పంపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది.
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): పదో తరగతి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాల వివరాలను నేరుగా విద్యార్థుల వాట్సాప్ కు పంపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. ఆదివారం నుంచి దశలవారీగా ఈ ప్రక్రియను ప్రారంభించింది. రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల జవాబు పత్రాలను పీడీఎఫ్ రూపంలో పంపుతున్నారు. విద్యార్థుల మార్కుల్లో ఏవైనా మార్పులు వచ్చాయా?. యథావిథిగా ఉన్నాయా?.. అనే సమాచారంతో పాటు పీడీఎఫ్‌ను పంపిస్తున్నారు. విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నంబర్లకు మనమిత్ర వాట్సాప్ ద్వారా ఈ వివరాలు అందిస్తున్నారు. కాగా, ఈ నెల 23లోగా దశలవారీగా విద్యార్థులందరికీ వారి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను పంపుతామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. అలాగే, సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంల లాగిన్లలోనూ ఈ ఫలితాలు అందుబాటులో ఉంటాయన్నారు.