Share News

ఆవు కడుపులో 100 కేజీల ప్లాస్టిక్‌

ABN , Publish Date - Apr 10 , 2026 | 11:33 PM

కోవెలకుంట్ల పట్టణానికి చెందిన పుల్లయ్య అనే రైతుకు చెందిన ఆవు కడుపు ఉబ్బి మూర్ఛపోయింది.

   ఆవు కడుపులో 100 కేజీల ప్లాస్టిక్‌
:ఆవు కడుపులో నుంచి బయటికి తీసిని ప్లాస్టిక్‌ చెత్త

ఆపరేషన చేసి కాపాడిన పశువైద్యాఽధికారులు

కోవెలకుంట్ల, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి) : కోవెలకుంట్ల పట్టణానికి చెందిన పుల్లయ్య అనే రైతుకు చెందిన ఆవు కడుపు ఉబ్బి మూర్ఛపోయింది. ఈ ఘటన శుక్రవారం జరిగింది. రైతు పశు వైద్యాధికారులను సంప్రదించడంతో.. ఏడీ కిషోర్‌ కుమార్‌ ఆవును పరీక్షించి, ఆపరేషన చేశాడు. దాని కడుపులో ఉన్న 100 కేజీల ప్లాస్టిక్‌ చెత్తతో పాటు దూడను బయటకు తీశాడు. బిజినవేముల పశువైద్యాధికారి నవీన, కలుగొట్ల పశువైద్యాధికారి విజయ నాయక్‌ సిబ్బందితో కలిసి ఆవుకు ఆపరేషన చేసి దూడతో పాటు న ప్లాస్టిక్‌ చెత్తను బయటికి తీశాడు. ఆవు, ఆవు దూడ సురక్షితంగా ఉన్నాయి.

Updated Date - Apr 10 , 2026 | 11:33 PM