Share News

కోటి మందితో 21న యోగా డే

ABN , Publish Date - Jun 04 , 2026 | 04:15 AM

ప్రతిష్ఠాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చంద్రబా బు తెలిపారు. కోటి మందితో..

కోటి మందితో 21న యోగా డే

  • ‘యోగా ఫర్‌ హెల్తీ ఏజింగ్‌‘ థీమ్‌తో ప్రతిష్ఠాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు: సీఎం చంద్రబాబు

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకంగా 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చంద్రబా బు తెలిపారు. కోటి మందితో ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా యోగాడే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యో గాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమ నిర్వహణపై బుధవారం సచివాలయంలో సీఎం మాట్లాడారు. ‘‘జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా బెస్ట్‌ మెడిసిన్‌. యోగాను మన జీవ న విధానంలో భాగం చేసేందుకు యోగాంధ్ర ద్వారా ప్రయత్నిస్తున్నాం. ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్‌ ‘యోగా ఫర్‌ హెల్తీ ఏజింగ్‌’... వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవించేందుకు యోగా ను అనుసరించాలి అని చెప్పడమే దీని ఉద్దేశం. ఇది ఒక్క రోజు కార్యక్రమం కాదు. ప్రతి ఇంట్లో ప్రతి వ్యక్తి నిత్య సాధనగా అలవాటు చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన ఉద్యమంగా మారాలి. జూన్‌ 7 నుంచి 14 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తాం. అమరావతిలో జరిగే ప్రధాన కార్యక్రమంలో కృష్ణా నది వెస్ట్‌ బైపాస్‌ వంతెనపై 25000 మందితో యోగా నిర్వహిస్తాం. ప్రతి జిల్లాకు ప్రత్యేక థీమ్‌ నిర్ణయించాం. రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ యోగా నిర్వహించి యోగా టూరిజాన్ని ప్రోత్సహిస్తాం’’ అని వెల్లడించారు.

విద్యాభ్యాసంతోపాటు యోగాభ్యాసం

‘‘యువత, మహిళలు, విద్యార్థుల్లో యోగా పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం. స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో భాగంగా యోగాను ప్రజారోగ్య ఉద్యమంగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో 10 లక్షల మంది సర్టిఫైడ్‌ యోగా సాధకులను తయా రు చేస్తాం. రూ.10 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిం చాం. ఏపీ యోగా ప్రచార పరిషత్‌, సంజీవని యా ప్‌, హాబిల్డ్‌ వాట్సాప్‌ కమ్యూనిటీ ద్వారా నిరంతర శిక్షణ చేపడుతున్నాం. జూన్‌ నెలను యోగా నెలగా ప్రకటించాం. యోగాంధ్రను విజయవంతం చేసేందు కు సలహాదారు మంతెన సత్యనారాయణరాజు సా యం తీసుకుంటున్నాం. ప్రతి ఇంటికి యోగా చేరేలా ప్రత్యేక వీడియోలు రూపొందించారు. వాట్సాప్‌ నంబరు 8142404888కి ‘హాయ్‌’ అని పంపిస్తే వీడియోలు వస్తాయి. డౌజ్చుఽఛీజిట్చ.్చఞ.జౌఠి.జీుఽ పోర్టల్‌ ను ప్రారంభించాం. ఏపీలో చేస్తున్న ప్రకృతిసేద్యానికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.’ అని తెలిపారు.

ఉప్పు, చక్కెర తగ్గించండి

‘నూనె, ఉప్పు, చక్కెర వంటివి తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుంది. నూనె రోజుకి 15-16 గ్రాములు వాడా లి. మనం 60 గ్రాములు వాడుతున్నాం. ఉప్పు రోజు కి 5 గ్రాములు వాడాలి. 10 గ్రాములు వాడుతు న్నాం. చక్కెర రోజుకి 25 గ్రాములు వాడాలి. 45- 50 గ్రాములు వాడుతున్నాం’ అని సీఎం వివరించారు.

Updated Date - Jun 04 , 2026 | 04:15 AM