Employees Accident Insurance: ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి ప్రమాద బీమా
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:39 AM
రాష్ట్ర ఆర్థికశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తూ గత ఏడాది మే 3న రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎన్.కుసుమ కరుణ కుమారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత...
చెక్కు అందజేసిన ఆర్థిక మంత్రి పయ్యావుల
ఎస్‌బీఐతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం ఫలితం
అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థికశాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తూ గత ఏడాది మే 3న రోడ్డు ప్రమాదంలో మరణించిన ఎన్.కుసుమ కరుణ కుమారి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద రూ.కోటి బీమా చెక్కును ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అందజేశారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఎస్‌బీఐ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి.. మృతురాలి కుటుంబ సభ్యులకు చెక్కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని వర్తింపజేయాలనే లక్ష్యంతో ఉద్యోగుల సమగ్ర జీతం ప్యాకేజీపై గత ఏడాది మార్చి నెలలో ఎస్‌బీఐ, యూబీఐ, యాక్సిస్, ఇండియన్, తదితర బ్యాంకులతో ప్రభు త్వం ఎంవోయూ కుదుర్చుకుందని మంత్రి కేశవ్ తెలిపారు. ఇందులో భాగంగా.. ఆర్థిక శాఖలో తొలి వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద.. బీమా సొమ్మును కుసుమకరుణకుమారి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్, కార్యదర్శి వినయ్ చంద్ ఎస్‌బీఐ అధికారులు పాల్గొన్నారు.