Share News

Weather Update : వణికిస్తున్న చలి

ABN , Publish Date - Dec 28 , 2025 | 04:42 AM

వాయవ్య భారతం నుంచి అతిశీతల గాలులు మధ్యభారతం మీదుగా దక్షిణాది వరకూ వీస్తున్నాయి.

Weather Update : వణికిస్తున్న చలి

  • జి.మాడుగులలో 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత

విశాఖపట్నం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): వాయవ్య భారతం నుంచి అతిశీతల గాలులు మధ్యభారతం మీదుగా దక్షిణాది వరకూ వీస్తున్నాయి. దీంతో ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ, మధ్య కోస్తా, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాల్లో శనివారం తీవ్రమైన చలి కొనసాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రజల దైనందిన కార్యకలాపాలపై ప్రభావం పడింది. ఉదయం 10 గంటల వరకు ప్రజలు బయటకు రావడానికి వెనుకంజ వేస్తున్నారు. మధ్యాహ్నం 3గంటల నుంచే మళ్లీ చలి వాతావరణం నెలకొంటోంది. 3వారాలుగా ఏజెన్సీలో రాత్రి ఉష్ణోగ్రతలు పదిలోపే నమోదవుతున్నాయి. శనివారం జి.మాడుగులలో 5.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా, రాయలసీమల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. వాయవ్య, మధ్యభారతాల్లో చలి తీవ్రత కొనసాగినంత కాలం రాష్ట్రంలోనూ ప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Updated Date - Dec 28 , 2025 | 04:44 AM