Share News

Telangana Assembly Winter Sessions: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం..

ABN , Publish Date - Dec 29 , 2025 | 10:41 AM

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అన్నీ పార్టీల ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సైతం అసెంబ్లీకి వచ్చారు. అయితే, కేసీఆర్ తిరిగి వెళ్లిపోయారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి.

Telangana Assembly Winter Sessions: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం..
Telangana Assembly Winter Session

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అన్నీ పార్టీల ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సైతం అసెంబ్లీకి వచ్చారు. అయితే, ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ దగ్గర కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసీఆర్‌ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిశారు. ఆ తర్వాత తెలంగాణ అటెండెన్స్ రిజిష్టర్‌లో సంతకం చేసిన కేసీఆర్.. అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాగా, సభ యథావిధిగా సాగుతోంది.

Updated Date - Dec 29 , 2025 | 10:56 AM