లడ్డు కల్తీ - భక్తి కల్తీ.. కొండకు పట్టిన శని
ABN , Publish Date - Dec 07 , 2025 | 06:44 AM
విలేకరుల సమావేశంలో జగన్‌రెడ్డి చెప్పిన రెండు అంశాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. కోటానుకోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంలో కూడా ఆయన అబద్ధాలను అలవోకగా చెప్పారు.
విలేకరుల సమావేశంలో జగన్‌రెడ్డి చెప్పిన రెండు అంశాలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. కోటానుకోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంలో కూడా ఆయన అబద్ధాలను అలవోకగా చెప్పారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి కూడా అపచారం తలపెట్టిన వారిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం మహా పాపం. భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డూ తయారీకి నాసిరకం నెయ్యి వాడిన విషయమై జగన్‌రెడ్డి చేస్తున్న వాదన రోతగా ఉంది. నాసిరకం నెయ్యి కొనుగోలులో ఎవరి పాత్ర ఏమిటి? ఎంత? అనేది సుప్రీంకోర్టు నియమించిన సిట్ నిర్ధారిస్తుంది.
ఇవి చదవండి