kumaram bheem asifabad- నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ముసాయిదా ఓటరు జాబితా
ABN , Publish Date - Sep 05 , 2025 | 11:01 PM
జిల్లా పరిషత్, ప్రాదేశిక నియోజక వర్గం, మండల ప్రాదేశిక నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించి వాటిపై అభ్యంతరాలు స్వీకరించి, తుది జాబితా ప్రచురణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జడ్పీ సీఈవోలు ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబందించిన ముసాయిదా ఓటరు జాబితాతో పాటు, పోలింగ్ స్టేషన్ల జాబితాలను జడ్పీ, మండల పరిష త్తులో ప్రచురించాలని ఆదేశాలు అందాయి
ఆసిఫాబాద్‌రూరల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్, ప్రాదేశిక నియోజక వర్గం, మండల ప్రాదేశిక నియోజకవర్గం ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించి వాటిపై అభ్యంతరాలు స్వీకరించి, తుది జాబితా ప్రచురణకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జడ్పీ సీఈవోలు ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబందించిన ముసాయిదా ఓటరు జాబితాతో పాటు, పోలింగ్ స్టేషన్ల జాబితాలను జడ్పీ, మండల పరిష త్తులో ప్రచురించాలని ఆదేశాలు అందాయి. మంగళవారం జిల్లాస్థాయి, మండలస్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని ఎన్నికల సంఘం సూచించింది. వాటిపై అభ్యంతరాలుంటే ఈనెల 8న లిఖిత పూర్వకంగా దరఖాస్తుకు అవకాశం కల్పించారు. వాటి ని ఈనెల 9లోగా పరిష్కరించి, 10న తుది జాబితా ప్రచురించాలని ఎస్‌ఈసీ ఆదేశించింది.
- జిల్లాలోని 15 మండలాల పరిధిలో..
జిల్లాలోని 15 మండలాల్లో 15 జడ్పీటీసీ, 127 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. ఒక్కో ఎంపీటీసీ పరిధిలో జనాభా ప్రకారం రెండు, మూడు జీపీలు వచ్చే విధంగా ప్రణాళికలు రుపొందించారు. జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. మొదటి విడతలో కాగజ్‌నగర్ డివిజన్‌లో ఏడు మండలాలతో పాటు ఆసిఫాబాద్ డివిజన్‌లోని రెబ్బెన, రెండో విడతలో ఆసిఫాబాద్ డివిజన్‌లోని మిగతా ఏడు మండలాల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రతిపాధించారు. జిల్లాలో 3,53,904 మంది ఓటర్లు ఉన్నారు. 15 జడ్పీటీసీ స్థానాలు, 127 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 693 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా జడ్పీ, మండల పరిషత్‌ల కాలపరిమితి గతేడాది జూలై 5తో ముగిసింది. 13 నెలలుగా జిల్లా పరిషత్‌లకు కలెక్టర్లు ప్రత్యేకాధికా రులుగా, మండల పరిషత్‌లకు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేకాధికారులుగా వ్యవహరిస్తు న్నారు. గ్రామాల్లో తాగు నీటి సరఫరా, రోడ్లు, వంతెనలు, ఎస్సీ సబ్‌ప్లాన్, దళితవాడల అభివృద్ధి పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మూత్రశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు వచ్చేవి. పాలకవర్గాలు లేకపోవడంతో వాటి రాక నిలిచిపోయింది.