kumaram bheem asifabad- జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ఖరారు
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:49 PM
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి జిల్లాలోని 15 మండలాల జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను శనివారం జిల్లా అదికార యంత్రాంగం ఖరారు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ ప్రక్రియను డ్రా పద్దతిన నిర్వహించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్దతిన రిజర్వేషన్ స్థానాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి జిల్లాలోని 15 మండలాల జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్లను శనివారం జిల్లా అదికార యంత్రాంగం ఖరారు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్ ప్రక్రియను డ్రా పద్దతిన నిర్వహించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్దతిన రిజర్వేషన్ స్థానాల కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 15 మండలాల జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, వెనుకబడిన తెగల, మహిళ స్థానాల కేటాయింపు రిజర్వేషన్ ప్రక్రియను డ్రా పద్దతిన నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్వనిర్వహణ అధికారి లక్ష్మినారయణ, సంబందిత అధికారులు, వివిధ రాజకీయ పార్టల నాయకులు పాల్గొన్నారు.
జడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల వివరాలు ఇలా..
---------------------------------------------------------------------------------------------------
క్రమసంఖ్య మండలం జడ్పీటీసీ ఎంపీపీ
---------------------------------------------------------------------------------------------------
1. ఆసిఫాబాద్ ఎస్టీ(జనరల్) ఎస్టీ మహిళ
2. సిర్పూర్(యూ) జనరల్ ఎస్టీ మహిళ
3. లింగాపూర్ జనరల్ మహిళ ఎస్టీ మహిళ
4. జైనూరు బీసీ జనరల్ ఎస్టీ జనరల్
5. తిర్యాణి బీసీ మహిళ జనరల్
6. కెరమెరి బీసీ జనరల్ జనరల్ మహిళ
7. వాంకిడి ఎస్టీ మహిళ ఎస్టీ జనరల్
8. రెబ్బెన బీసీ మహిళ బీసీ జనరల్
9. బెజ్జూరు ఎస్టీ జనరల్ ఎస్టీ జనరల్
10. పెంచికలపేట ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ
11. కాగజ్‌నగర్ బీసీ మహిళ బీసీ మహిళ
12. కౌటాల బీసీ జనరల్ బీసీ జనరల్
13. చింతలమానేపల్లి ఎస్టీ జనరల్ బీసీ మహిళ
14. దహెగాం ఎస్టీ మహిళ ఎస్సీ జనరల్
15. సిర్పూర్(టి) ఎస్సీ జనరల్ బీసీ జనరల్