Share News

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం

ABN , Publish Date - Aug 10 , 2025 | 11:35 PM

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అభి వృద్ధి శూన్యమని, కుంభకోణాలు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఐదేళ్లు పార్లమెంట్‌ సభ్యుడిగా, ఐదేళ్లు ప్రభుత్వ విప్‌గా పనిచేసిన బాల్క సుమన్‌ నియోజకవర్గంలో ఏ విధంగా వ్యవహరించాడో ప్రజలందరికీ తెలుసన్నారు.

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం

-జైపూర్‌ ప్లాంటు విస్తరణకు సీఎంతో శంకుస్థాపన

- ఐదు వేల మందికి ఉద్యోగాలు

-నియోజకవర్గానికి బీఆర్‌ఎస్‌ చేసిందేమి లేదు

మందమర్రిటౌన్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో అభి వృద్ధి శూన్యమని, కుంభకోణాలు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఐదేళ్లు పార్లమెంట్‌ సభ్యుడిగా, ఐదేళ్లు ప్రభుత్వ విప్‌గా పనిచేసిన బాల్క సుమన్‌ నియోజకవర్గంలో ఏ విధంగా వ్యవహరించాడో ప్రజలందరికీ తెలుసన్నారు. ఆది వారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలోని జైపూర్‌ పవర్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంటుకు మరి కొన్ని రోజుల్లో శంకుస్థాపన చేయనున్నామని, దీన్ని సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారని తెలిపా రు. దీంతో 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. స్థానికులకు ఉ ద్యోగాలు ఇవ్వాలని సింగరేణిని కోరగా 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే రా నున్నాయన్నారు. శంకుస్థాపనకు సీఎం హాజరవుతారని తెలిపారు. చెన్నూరు ని యోజకవర్గంలో భూ దందా, ఇసుక దందా అక్రమాలు జరిగాయని, తాను గెలి చిన తర్వాత వీటన్నింటికీ ముగింపు పలికానని తెలిపారు. నియోజకవర్గంలోని కోటపల్లిలో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలకు 200 కోట్లు మంజూరు చేశామని, త్వర లోనే టెండర్లు పిలిచి పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. తాను విద్య, వైద్యానికి పె ద్దపీట వేస్తున్నానని తెలిపారు. తనను విమర్శించే అర్హత ఎవరికి లేదన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చెన్నూరు ఎమ్మెల్యే కేసీఆర్‌ చిన్న కొడు కునని చెప్పుకుని రైల్వే బ్రిడ్జి పనులు, ఇతర పనులు ఎందుకు చేయలేదన్నారు. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లు ఇతర పనులను కమీషన్‌ల కోసమే చేశారన్నారు. కాం గ్రెస్‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. నియో జకవర్గంలో భవిష్యత్‌లో తాగునీటి సమస్య లేకుండా వంద కోట్లతో అమృత్‌ 2.0 పథకం కింద పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. వార్డుల్లో రోడ్లు, డ్రైనే జీలు, తాగునీటి అవసరాలను తీరుస్తున్నామన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మంత్రికి రాఖీలు కట్టిన మహిళలు

రాష్ట్ర గనుల, కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామికి ఆదివారం మహిళలు రాఖీలు కట్టారు. మంత్రి క్యాంపు కార్యాలయానికి రాగానే మహిళలు వచ్చి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. అన్నాచెల్లెళ్లు, అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ అని తెలిపారు.

Updated Date - Aug 10 , 2025 | 11:35 PM