Share News

Former Minister Harish Rao: బీజేపీ, కాంగ్రె్‌సల నిర్లక్ష్యం.. రైతులకు మరణ శాసనం

ABN , Publish Date - Sep 11 , 2025 | 06:06 AM

రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం పెట్టుకోవడం తప్ప పరిష్కరించడం...

Former Minister Harish Rao: బీజేపీ, కాంగ్రె్‌సల నిర్లక్ష్యం.. రైతులకు మరణ శాసనం

హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెపం పెట్టుకోవడం తప్ప పరిష్కరించడం లేదని, బీజేపీ, కాంగ్రె్‌సల నిర్లక్ష్య వైఖరి రైతులకు మరణ శాసనంగా మారిందని మాజీమంత్రి హరీశ్‌రావు బుధవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. పత్తి పూత దశలో, వరి పొట్టదశలో ఉందని, ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడి రాదంటూ రైతులు పడుతోన్న ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పనికిమాలిన దృష్టి మళ్లింపు రాజకీయాలు మాని, యూరియా సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్‌ ఎంపీలున్నా తెలంగాణకు శూన్య హస్తాలే మిగిలాయని, రైతుల సమస్యలు వారికి ఏమాత్రం పట్టడం లేదన్నారు

Updated Date - Sep 11 , 2025 | 06:06 AM