Share News

kumaram bheem asifabad- సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సంకల్పాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , Publish Date - Oct 31 , 2025 | 10:25 PM

దేశ సమగ్రత, ఐక్యతకు కృషి చేసిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆలోచనలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమంలో భాగంగా 2కే రన్‌ను ప్రారంభించారు.

kumaram bheem asifabad- సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ సంకల్పాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
ఆసిఫాబాద్‌లో రన్‌ ఫర్‌ యూనిటీలో పాల్గొన్న ఎస్పీ, పోలీసులు, యువకులు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): దేశ సమగ్రత, ఐక్యతకు కృషి చేసిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఆలోచనలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఎస్పీ కాంతిలాల్‌ పాటిల్‌ అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమంలో భాగంగా 2కే రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, భారత దేశ మొదటి ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భారత ఏకీకతకు ప్రతీక అని చెప్పారు. ఆయన కృషి వల్లే మన దేశం ఐక్యంగా నిలిచిందని అన్నారు. మనమంతా ఆయన ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకొని దేశ ఐక్యత, అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. ఈ రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమం దేశ భక్తి ఐక్యతకు ప్రతీకగా నిలిచిందన్నారు. అంతకు ముందు జిల్లా పోలీసు కార్యాలయం నుంచి కేబీ చౌక్‌ మీదుగా రెండు కిలో మీటర్ల దూరం వరకు పరుగు పందెం నిర్వహించగా జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్‌, రాణా ప్రతాప్‌, ఆర్‌ఐ పెద్దన్న, ఆర్‌ఐ విద్యాసాగర్‌, ఆర్‌ఎస్‌ఐలు, స్పెషల్‌ పార్టీ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ పార్టీ కార్యాలయంలో సర్ధార్‌వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, సీనియర్‌ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావు, మాజీ ఎంపీపీ అరిగెల మల్లికార్జున్‌లు వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటా నికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు నరేష్‌, సుజిత్‌, జయరాజ్‌, వెంకన్న, పోశన్న, ప్రసాద్‌గౌడ్‌, మురళీగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): మండలంలో పోలీసుల అధ్వర్యంలో యూనిట్‌ రన్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జైనూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కుడ్మేత విశ్వనాథ్‌రావు, ఎస్సై రామకృష్ణ, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఎస్సై వెంకటకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు 2కే రన్‌ నిర్వహించారు. పోలీసు స్టేషన్‌ నుంచి బస్టాండు మీదుగా రెండు కిలో మీటర్లు క్రీడాకారులు, యువకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువకులు శారీరక దృడత్వం ఆరోగ్యం కోసం ప్రతి రోజు ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కానిస్టేబుల్‌ వెంకటేష్‌తో పాటు మండల కేంద్రానికి చెందిన యువకులు పాల్గొన్నారు.

బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఎస్సై సర్తాజ్‌ పాషా ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ యూనిటీ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఎస్సై విక్రమ్‌ ఆధ్వర్యంలో పోలీసులు 2కే రన్‌ నిర్వహించారు. మండల కేంద్రంలో అంగడిబజార ఏరియా నుంచి పోలీసు స్టేషన మీదుగా రెండు కిలో మీటర్లు పరుగు నిర్వహించారు. కార్యకరమంలో పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ఎస్సై అనీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్‌ నుంచి బొంబాయిగూడ వరకు పరుగు పందెం నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో ఎక్తా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మధుకర్‌ యువకులతో కలిసి 2కే రన్‌లో పాల్గొన్నారు. అనంతరం హట్టి నుంచి కెరమెరి వరకు ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, యువకులు తదిరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 10:25 PM