Share News

యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

ABN , Publish Date - Dec 26 , 2025 | 09:58 PM

యువత క్రీడలపై ఆసక్తిపెంచుకో వాలని ఏసీపీ రవి కుమార్‌ అన్నారు. శుక్రవారం మురళి మొమోరియల్‌ క్రికెట్‌ అకాడమిలో ఎఎంసీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ ప్రీమి యర్‌ లీగ్‌టోర్నమెంటును ప్రారంభించి మాట్లాడారు.

యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

బెల్లంపల్లి,డిసెంబరు26(ఆంధ్రజ్యోతి): యువత క్రీడలపై ఆసక్తిపెంచుకో వాలని ఏసీపీ రవి కుమార్‌ అన్నారు. శుక్రవారం మురళి మొమోరియల్‌ క్రికెట్‌ అకాడమిలో ఎఎంసీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ ప్రీమి యర్‌ లీగ్‌టోర్నమెంటును ప్రారంభించి మాట్లాడారు. నేటి యువత చెడు అలవాట్లకు లోనుకాకుండా క్రీడలపై దృష్టి సారించాలన్నారు. క్రీడలతో మా నసికోల్లాసంతోపాటు దేహదారుఢ్యం మెరుగుపడుతుందన్నారు. క్రీడల్లో మంచి నైపుణ్యం సాధించే క్రీడాకోట కింద ఉద్యోగ అవకాశాలు సైతం ఉం టాయన్నారు. క్రీడల్లో క్రీడాకారులు అందరూ కీడ్రాస్పూర్తి ప్రదర్శించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్‌ నాతరి స్వామి, పట్టణ అద్యక్షులు ముచ్చర్ల మల్లయ్య, సీనియర్‌ క్రీడాకారులు వెంకటస్వా మి, వెంకటేశ్వర్లు, జాడి శేఖర్‌, గౌతం, హరీశ్‌ కుమార్‌లు పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 09:58 PM