Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు యువకుడి బలి
ABN , Publish Date - May 25 , 2025 | 05:07 AM
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని కొత్లాపూర్ సమీపంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో అప్పులపాలైన యువకుడు రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూ.2 లక్షల వరకు అప్పు చేసి తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు.
మర్పల్లి, మే 24 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్ బెట్టింగ్‌లో చిక్కుకుని అప్పులపాలైనఓ యువకుడు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కొత్లాపూర్‌లో జరిగింది. కోటమర్పల్లికి చెందిన విజయ్ కుమార్(23) ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొటుకుని రూ.2లక్షల వరకు అప్పులపాలయ్యాడు. అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురై శనివారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం కొత్లాపూర్ శివారులో హైదరాబాద్ నుంచి పూర్ణాకు వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Vijayawada Durgamma: దుర్గగుడిలో భక్తుల రద్దీ.. కీలక నిర్ణయం తీసుకున్న EO
Husband And Wife: సెల్‌ఫోన్‌లో పాటలు.. సౌండ్ తగ్గించమన్నందుకు భార్యపై దారుణం..