‘మీ డబ్బు-మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:14 PM
వివిధ కారణాలతో క్లెయిమ్ చేసుకోని ఆర్ధికపరమైన ఆస్తుల కోసం ప్ర భుత్వం వెసులుబాటు కల్పిస్తూ అందుబాబులోకి తెచ్చిన ‘మీ డబ్బు - మీ హక్కు’ కార్యక్రమా న్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు.
- అదనపు కలెక్టర్ మరేందర్
నాగర్‌కర్నూల్ టౌన్, డిసెం బరు 23 (ఆంధ్రజ్యోతి): వివిధ కారణాలతో క్లెయిమ్ చేసుకోని ఆర్ధికపరమైన ఆస్తుల కోసం ప్ర భుత్వం వెసులుబాటు కల్పిస్తూ అందుబాబులోకి తెచ్చిన ‘మీ డబ్బు - మీ హక్కు’ కార్యక్రమా న్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. మంగళ వారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మీ డబ్బు- మీ హక్కు కార్యక్రమంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత నవంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు మీ డబ్బు-మీ హక్కు నినాద కార్యక్రమం కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రజలు తమకు చెందవలసిన అన్ క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫం డ్ డిపాజిట్లు, షేర్లు, బీమా రాబడులు తదితర ఆర్థికపరమైన ఆస్తులను తిరిగి క్లెయిమ్ చేసుకు నే అవకాశం కల్పిస్తున్నదని తెలిపారు. బ్యాంకు ల్లో 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల వివరాలు ఆర్‌బీఐ ఉద్గమ్ వెబ్ సైట్ ద్వారా తెలుసుకుని సులభం గా పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనే జరు చంద్రశేఖర్, ఎస్‌బీఐ ఆర్‌ఎం సునీత, టీజీబీ ఆర్‌ఎం సంగీత, డీసీసీబీ ఏజీఎం అబ్దుల్ నబీ, ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్ జావిద్ అహ్మద్, వివిధ బ్యాంకుల మేనేజర్లు అధికారులు, విని యోగదారులు పాల్గొన్నారు.