Young Woman Commits Suicide: ఆర్‌ఎంపీ వేధింపులతో యువతి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:52 AM
ఆర్‌ఎంపీ వేధింపులు భరించలేక ఓ యువతి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లికి చెందిన సందీ...
కారేపల్లి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎంపీ వేధింపులు భరించలేక ఓ యువతి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేలకాయలపల్లికి చెందిన సందీప్తి(22)కి, అదే గ్రామంలో ఉంటోన్న ఆర్‌ఎంపీ వైద్యుడు నరేశ్‌కు మధ్య కొంతకాలం క్రితం స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలో నరేశ్ పలు సందర్భాల్లో ఆమెతో కలిసి సెల్ఫీలు తీసుకున్నాడు. ఆ ఫొటోలను అడ్డుపెట్టుకుని పెళ్లి చేసుకోవాలని యువతిని ఒత్తిడి చేశాడు. లేదంటే వారిద్దరు కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పెట్టి పరువు తీస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఈ విషయంపై వారం క్రితం.. యువతి తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా నరేశ్ సందీప్తి వెంటపడటం ఆపలేదు. దీంతో నరేశ్ వేధింపుల గురించి గ్రామంలో అందరికీ తెలిసి, తన కుటుంబం పరువు పోయిందని భావించిన యువతి ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు కొత్తగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వైద్యుడిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ గోపి తెలిపారు.