Share News

Bike Accident: కుక్కలు వెంబడించడంతో.. బైకుపై నుంచి పడి యువకుడి మృతి

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:45 AM

ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని వీధికుక్కల రూపంలో మృత్యువు వెంటాడింది. ఉద్యోగం ముగించుకుని రాత్రి ద్విచక్రవాహనంపై...

Bike Accident: కుక్కలు వెంబడించడంతో.. బైకుపై నుంచి పడి యువకుడి మృతి

గీసుగొండ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడిని వీధికుక్కల రూపంలో మృత్యువు వెంటాడింది. ఉద్యోగం ముగించుకుని రాత్రి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా కుక్కలు వెంటపడ్డాయి. దీంతో బైకు అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయి ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన వరంగల్‌ జిల్లాలోని గీసుకొండ మండలం మచ్చాపుర్‌ గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మండలంలోని ఎలుకుర్తి గ్రామానికి చెందిన ఆడెపు శివకుమార్‌ (24) హన్మకొండలో ఉద్యోగం ముగించుకుని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ఈ ఘటన జరిగింది.

Updated Date - Dec 04 , 2025 | 04:45 AM