kumaram bheem asifabad- యువ విలాపం
ABN , Publish Date - Jul 30 , 2025 | 11:21 PM
యువత స్వ యం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. దరఖాస్తులు సమర్పించి నాలుగు నెల లు కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందుదామనుకున్న యువత ఆశలు ఆవిరిరవుతున్నా యి.
- ఎదురుచూస్తున్న నిరుద్యోగులు
- ఇంటర్వ్యూలు పూర్తయినా స్పష్టత కరువు
- జిల్లాలో 29 వేల మంది దరఖాస్తు
ఆసిఫాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): యువత స్వ యం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. దరఖాస్తులు సమర్పించి నాలుగు నెల లు కావస్తున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందుదామనుకున్న యువత ఆశలు ఆవిరిరవుతున్నా యి. వాస్తవానికి జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు రాయితీ రుణాల మంజూరు పత్రాల ను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ చివరి క్షణంలో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. రాయితీ రుణాల పంపిణీపై సందిగ్దత నెలకొంది. దీంతో దరఖా స్తుదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరుగుతు న్నారు.
- ప్రభుత్వ సూచన మేరకు..
ప్రభుత్వ సూచన మేరకు యువ వికాసం పథకానికి జిల్లాలోని నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకు న్నారు. ఈ పథకం కిద ఎస్సీ, ఎస్టీ. బీసీ, ఈడబ్యూఎస్, మైనార్టీలకు రూ.50 వేల నుంచి మొదలుకొని రూ.4లక్షల వరకు వివిధ రకాల యూనిట్ల కొనుగోలుకు బ్యాంకు లింకేజీతో కూడిన రుణాలు అందించాలని నిర్ణయించింది. రూ.50 వేల యూనిట్‌కు 100 శాతం సబ్సిడీ,రూ. లక్ష నుంచి రూ.2 లక్షల రుణాలకు 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల పైనుంచి రూ.4 లక్షల యూనిట్ల కోసం70 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం రేషన్‌కార్డు కలిగిన నిరుపేద కుటుంబం లోని ఒక్కరికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌తో పాటు అప్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించారు. దీంతో ఈ పథకా నికి జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన నిరుద్యోగులు 29,756 మంది దరఖాస్తులు చేసుకున్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖరారు చేసి అధికారులు,బ్యాంకు సిబ్బందితో కలిసి ఇంటర్వూలు సైతం నిర్వహించారు. దీంతో దరఖాసు ్తదారుల్లో ఆశలు చిగురించాయి. జూన్ 2న తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం నుంచి ఈ పథకాన్ని ప్రారంభి స్తామని సర్కార్ ప్రకటన చేసింది. కానీ నేటికి పథకం అమలుకు నోచుకోలేదు. నాలుగు నెలలు కావస్తున్నా ప్రభుత్వం నుంచి యువ వికాసం అమలుపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో దరఖాస్తుధారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.
- 15 మండలాల పరిధిలో..
జిల్లాలోని 15 మండలాల పరిధిలోని 335 గ్రామ పంచాయతీల పరిధిలో రాజీవ్ యువ వికాసం పథకానికి వివిధ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత 29.756 మంది ధరఖాస్తు చేసుకున్నారు. మండలాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి. ఆసిఫాబాద్ మండలంలో 3,040 మంది. కాగజ్‌నగర్‌లో 5,486, రెబ్బెనలో 2,827, కౌటాలలో 2,327 మంది దరఖాస్తు చేసుకున్నారు. చింతలమానేపల్లిలో 1,907, జైనూర్‌లో 1,860, బెజ్జూరులో 1,788, కెర మెరిలో 1,761, తిర్యాణి లో 1,690, దహెగాంలో 1.622, సిర్పూర్(టి)లో 1,616, వాంకిడిలో 1,074, పెంచికల్‌పేటలో 1,072, సిర్పూ ర్(యు)లో 893, లింగాపూర్‌లో 793 మంది రు ణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికీ రుణాలు అం దకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతు న్నారు.
కిరాణ దుకాణం ఏర్పాటుకు..
- సురేష్, ఆసిఫాబాద్
రాజీవ్ యువ వికాసం పథకంలో కిరాణ దుకాణం ఏర్పాటు కోసం రూ. 4 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకునాను. అధికారులు నిర్వహించిన ఇంటర్వ్యూకు కూడా హాజర య్యాను. ఇంటర్వ్యూలో అధికారులు అన్ని ధ్రువికరణ పత్రాలు పరిశీలించారు. జూన్ రెండు నుంచే రుణాలు ఇస్తామని చెప్పారు. నేటికి రుణం మంజూరు కాలేదు. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు వెంటనే రుణం మంజూరు చేయాలి.
కాలయాపన చేయడం సరికాదు..
- సుచిత్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం రుణాలు మంజూరీలో కాలయాపన చేయడం సరికాదు. నిరు ద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రుణాలు ఇస్తామని చెప్పి దీనిపై నిర్ణయం తీసుకోకుండా దరఖాస్తుదారు లను ప్రభుత్వం మోసం చేయడం సరికాదు. రుణా లను వెంటనే మంజూరు చేయాలి.