Young Filmmakers Challenge: బతుకమ్మ పై యంగ్ ఫిల్మ్‌మేకర్స్ ఛాలెంజ్
ABN , Publish Date - Sep 17 , 2025 | 05:06 AM
బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ’యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్’ పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్పొరేషన్ చైర్మన్..
ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండగ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ’యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్’ పోటీలను నిర్వహిస్తున్నట్లు కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు, కళారూపాలపై షార్ట్ ఫిలిం, పాటల పోటీలు ఉంటాయన్నారు. 40 ఏళ్ల లోపు యువత 3-5 నిమిషాలకు మించకుండా వీడియోలను రూపొందించాలని చెప్పారు. పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి రూ.3 లక్షలు, రెండో బహుమతి రూ.2 లక్షలు, మూడో బహుమతి రూ.1 లక్ష, కన్సొలేషన్‌గా రూ. 20వేలు చొప్పున (ఐదుగురికి) అందిస్తామని దిల్ రాజు తెలిపారు. ఎంట్రీలను డౌఠుఽజజజీజూఝఝ్చజ్ఛుటటఛిజ్చిజూజ్ఛూుఽజ్ఛఃజఝ్చజీజూ.ఛిౌఝ)కి లేదా వాట్సాప్ నం.8125834009కు సెప్టెంబర్ 30లోగా పంపించాలన్నారు.