Young Candidates: ఎన్నికల్లో యువరక్తం
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:54 AM
పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల యువతరం పోటీలోకి దిగుతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన గుగులోతు...
అక్రమంగా సంపాదిస్తే జప్తు చెయ్యండి
బాండ్ పేపర్‌పై రాసిచ్చి
ఓటు అడుగుతున్న ఓ యువకుడు
తుంగతుర్తి, భగత్‌నగర్, నంగునూరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి) : పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల యువతరం పోటీలోకి దిగుతోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన గుగులోతు జైపాల్‌నాయక్ కూడా తమ గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాడు. అయితే, జైపాల్ నాయక్ ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తాను సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత తాను కానీ, తన కుటుంబసభ్యులు కానీ ఒక్క రూపాయి అక్రమంగా సంపాదించినా దానిని పంచాయతీ జప్తు చేసుకోవచ్చునని ఓ బాండ్ పేపర్‌పై రాశాడు. ఆ పత్రంతో ఓటర్ల దగ్గరకు వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. ఇక, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా మల్యాల జాహ్నవి(25) అనే యువతి పోటీ పడుతున్నారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగిని అయిన జాహ్నవి.. ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఎన్నికల బరిలో నిలిచారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం సిద్దన్నపేటకు చెందిన అనరాజుల రోహిణి అనే యువతి తమ గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. పీజీ పూర్తి చేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న రోహిణి ఉద్యోగానికి రాజీనామా చేశారు.