ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
ABN , Publish Date - Dec 16 , 2025 | 11:21 PM
మూడవ విడత ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేం దుకు పోలీసు శాఖ పూర్తి స్థాయిలో పని చే స్తోందని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్‌జీ పాటి ల్ అన్నారు.
- పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
అచ్చంపేటటౌన్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : మూడవ విడత ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేం దుకు పోలీసు శాఖ పూర్తి స్థాయిలో పని చే స్తోందని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్‌జీ పాటి ల్ అన్నారు. అచ్చంపేట మండల పరిధిలోని సిద్దాపూర్, బొమ్మన్‌పల్లి గ్రామాలలోని పోలిం గ్ కేంద్రాలను ఆయన మంగళవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా బొమ్మన్‌పల్లి పో లింగ్ స్టేషన్‌లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీ లించిన ఆయన విధులు నిర్వహిస్తున్న పోలీ స్ సిబ్బంది, అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీ య ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఓటర్లు ప్రశాంత వాతావర ణంలో నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్య లు చేపట్టినట్లు తెలిపారు. ప్రతీ ఓటరుకు పూర్తి భద్రత కల్పిస్తూ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని పోలీస్ అధికారు లను ఆదేశించారు.
అప్రమత్తంగా ఉండాలి
చారకొండ, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) మూడవ విడత పంచాయతీ ఎన్నికల విధు ల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండి సమ స్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జీపాటిల్ సూచించారు. చారకొండ మండలంలో జరుగుతున్న ఎన్నిక ల దృష్ట్యా మంగళవారం ఆయన పోలీస్ స్టే షన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంత రం రికార్డులు పరిశీలించారు. సమావేశంలో కల్వకుర్తి డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఐ వి ష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐలు వీరబాబు, రాజశేఖర్, మహేష్‌గౌడ్, కురుమూర్తి పాల్గొన్నారు.