kumaram bheem asifabad- దిగుబడిపై దిగాలు.. ధరపైనే ఆశలు
ABN , Publish Date - Oct 10 , 2025 | 10:43 PM
పత్తి పంటకు ఈ ఏడాది ప్రతి కూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. దిగుబడులు భారీగా తగ్గి పోవడం తో రైతులు దిగాలు పడుతున్నారు. మద్దతు ధర పైననే భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. జిల్లాలో ని రైతులు ప్రధానంగా పత్తి పంటనే సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలలకు అనువైన పంట కావడంతో రైతులు అధికంగా పత్తి పంటనే సాగు చేస్తున్నారు.
- సీసీఐ కఠినమైన నిబంధనలతో మద్దతు దక్కడం గగనమే
- కపాస్ కిసాన్ యాప్‌తో పత్తి రైతుల్లో ఆందోళన
- త్వరలోనే పంట కొనుగోళ్లకు అధికారుల ఏర్పాట్లు
చింతలమానేపల్లి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): పత్తి పంటకు ఈ ఏడాది ప్రతి కూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. దిగుబడులు భారీగా తగ్గి పోవడం తో రైతులు దిగాలు పడుతున్నారు. మద్దతు ధర పైననే భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. జిల్లాలో ని రైతులు ప్రధానంగా పత్తి పంటనే సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలలకు అనువైన పంట కావడంతో రైతులు అధికంగా పత్తి పంటనే సాగు చేస్తున్నారు. ఈ ఏడాదివ వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పంట ఏపుగా పెరిగి కనిపిస్తుంది. కానీ చేతికి వచ్చే దశలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు పంట ఎరుపు బారిపో యి జౌకు పట్టి పోతుంది. దీంతో దిగుబడులపై తీ వ్ర ప్రభావం పడుతుందని రైతులు వాపోతున్నారు.
- సాధారణ సాగు విస్తీర్ణం..
జిల్లాలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 4.6 లక్షల ఎకరాలు. కాగా ఇందులో అత్యధికంగా 3.5 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోంది. ఇప్పుడి ప్పుడే పంట దిగు బడులు చేతికి వస్తున్నాయి. దీంతో పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు అధికా రులు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడు సీసీఐ ఆధ్వ ర్యంలో పత్తి పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 14 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. త్వరలోనే కొనుగోళ్లను ప్రారంభించేందుకు అవకాశం ఉంది. ఈ సారి పత్తి మద్దతు ధర క్వింటాళులకు రూ.8110గా ప్రభుత్వం నిర్ణయిచింది. కానీ పంట నాణ్యత, తేమ శాతం, అంతార్జతీయ మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో మద్దతు ధర దక్కడం గగనమేనన్న అభిప్రాయాలున్నాయి.
- భారీ వర్షాలతో..
ఈ వానాకాలలో భారీ వర్షాలతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడుతుంది. అధిక తేమతో కాత పూత నేలరాలుతుంది. చేతికొచ్చిన పత్తి నలుపుబారి నాణ్యత లేకుండా పోతుంది. పత్తి కాయల నాణ్యత దెబ్బతినడంతో ధరలు పడిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబరు 7 వరకు జిల్లాలో అత్యధిక వర్షాపాతం నమోదయింది. జిల్లాలో నల్లరే గడి నేలలే అధికగా ఉన్నాయి. కురుస్తున్న భారీ వర్షాలకు నల్లరేగడి నేలల్లో అధిక తేమ పంట ఏపుగా పెరిగి పోయి కలుపు నివారణకు అవకాశం లేక పోవడంతో పత్తి పంటను కలు మొక్కలు కప్పేస్తున్నాయి. ఎకరానికి కనీసం 5 నుంచి 6 క్విం టాళ్ల వరకైనా దిగు బ డులు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. దిగుబడులు తగ్గి పెట్టుబడి ఖర్చులు పెరిగి పోవ డంతో నష్టాలే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- తేమతో ధరల్లో కోతలు..
సీసీఐ విధిస్తున్న కఠినమైన నిబంధనలతో పత్తి రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ముఖ్యంగా తేమ శాతం పేరిట ధరల్లో కోతలు పెట్టడంతో రైతు లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 8 నుంచి 12 తేమ శాతం ఉన్న పత్తిని మాత్రమే సీసీఐ కొనుగోలు చేస్తుంది. 8 శాతం తమ ఉన్న పత్తికి రూ.8,110 మద్దతు ధరను చెల్లిస్తుంది. అపైగా ఒక్కో పాయిం ట్‌కు రూ.8,110 గత ఐదేళ్లుగా పెరిగిన మద్దతు ధరలను పరిశీలిస్తే గరిష్ఠంగా రూ.2281 మాత్రమే పెరిగింది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులతో ఏ ఒక్క రైతుకు మద్దతు ధర దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకు కంటే అక్టోబరు నుంచి జనవరి వరకు తేమ అధి కంగా ఉండడంతో మద్దతు ధర దక్కే అవకాశమే ఉండదు. అలాగే తేమ, నా ణ్యత పేరిట సీసీఐ కొనుగోళ్లకు కొర్రీలు పెట్టడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి పంటను అమ్ముకొనే పరిస్థితి ఎదురవుతుంది. కాగా ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్‌లో క్వింటాలు పత్తికి రూ.5 వేల నుంచి రూ.7 వేల లోపే ధర పలుకుతోంది. దీంతో పత్తి రైతులు భారీగా నష్ట పోతున్నారు.