నాడు కళకళ...నేడు వెలవెల
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:38 PM
నాడు బొగ్గు గనులు, కార్మిక కుటుంబాలతో కళకళలాడిన సింగరే ణి ప్రాంతం నేడు కార్మికులు లేక వెలవెలబోతున్నది. ఓ వైపు బొగ్గు గనులు మూత పడుతుండగా, మరో వైపు సింగరేణి యాజమాన్యం నూతన నియామకాలు చేపట్టకపోవడంతో కార్మికవాడలు పూర్తిగా బోసిపోతు న్నాయి.
-బోసిపోతున్న సింగరేణి ఏరియాలు
-తగ్గుముఖం పడుతున్న కార్మికుల సంఖ్య
-గనులు మూతపడుతుండటంతో వలసబాట
-కొత్త గనుల ఏర్పాటుపై ఉదాసీన వైఖరి
-ప్రభుత్వం చర్యలు చేపట్టాలంటున్న కార్మికలోకం
మంచిర్యాల, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): నాడు బొగ్గు గనులు, కార్మిక కుటుంబాలతో కళకళలాడిన సింగరే ణి ప్రాంతం నేడు కార్మికులు లేక వెలవెలబోతున్నది. ఓ వైపు బొగ్గు గనులు మూత పడుతుండగా, మరో వైపు సింగరేణి యాజమాన్యం నూతన నియామకాలు చేపట్టకపోవడంతో కార్మికవాడలు పూర్తిగా బోసిపోతు న్నాయి. గనుల మూతతో ఇంతకాలం ఇక్కడ పనిచే సిన కార్మికులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండటం తో కొన్ని ఏరియాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
నియామకాల పట్ల కానరాని శ్రద్ధ..
ఒకప్పుడు సింగరేణి ఉద్యోగం అంటేనే ప్రాణభయం తో వణికేవారు. బొగ్గుబాయిలో ఉద్యోగం చేసేందుకు వెనుకంజ వేసేవారు. కాలక్రమంలో సింగరేణి సంస్థ ఉద్యోగ కల్పవల్లిగా రూపాంతరం చెందింది. బొగ్గు ఉ త్పత్తి అవసరాల కోసం అప్పటి డైరెక్టర్ జీపీ రావు నేతృత్వంలో కార్మికుల సంఖ్య పెంచేందుకు కృషి చేశా రు. 1985 ప్రాంతంలో రన్నింగ్ ద్వారా ఏక కాలంలో సుమారు 40వేల నియమాకాలు చేపట్టారు. అలా సిం గరేణిలో కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కా లక్రమంలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరి గనప్ప టికీ కార్మికుల సంఖ్య మాత్రం క్రమేపీ తగ్గుతూ వ స్తోంది. సంస్థలో కార్మికులు అవసరమైన దానికంటే అధికంగా ఉన్నారనే కారణంతో వివిధ పద్ధతుల్లో యాజమాన్యం వారి సంఖ్యను తగ్గించేందకు శ్రీకారం చుట్టింది. గోల్డెన్ షేక్‌హ్యాండ్ పథకాన్ని తెరపైకి తేవ డం ద్వారా సర్వీసు మిగిలి ఉండగానే కార్మికులను ముందస్తుగా ఉద్యోగాల్లో నుంచి తొలగించే ప్రక్రియకు నాంది పలికింది. అలా ప్రారంభమైన కార్మికుల ఏ రివేత కారణంగా సింగరేణి వ్యాప్తంగా వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది.
క్రమేపీ తగ్గుముఖం....
ఒకప్పుడు లక్షా పై చిలుకు కార్మికులు పనిచేసిన సింగరేణి సంస్థలో కాలక్రమేణ కార్మికుల సంఖ్య గణ నీయంగా తగ్గు ముఖం పడుతోంది. సింగరేణి వ్యాప్తం గా అన్ని ఏరియాలలో ఇదే పరిస్థితి నెలకొనగా ప్రస్తు తం కార్మికుల సంఖ్య 40 వేలకు పడిపోయింది. గడి చిన ఐదేళ్ల కాలంలో ఎన్నడూ లేనివిధంగా కార్మికుల సంఖ్య వేగంగా తగ్గుముఖం పట్టగా, కొత్త నియామ కాల పట్ల యాజమాన్యం ఊసెత్తకపోవడంతో సంస్థ మనుగడకు ప్రమాదం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నా యి. సింగరేణికి సంబంధించి జిల్లాలోని శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలు ఉన్నాయి. వీటి ప రిధిలో ఐదేళ్ల కిత్రం మూడు ఏరియాలలో సుమారు 21వేల వరకు ఉన్న కార్మికుల సంఖ్య నేడు గణనీయం గా తగ్గింది. ప్రస్తుతం మూడు ఏరియాలలో కలిపి 14 వేల పై చిలుకు మంది మాత్రమే విధులు నిర్వహి స్తున్నారు.
కొత్త గనుల ఏర్పాటు ఎప్పుడో...?
బొగ్గు ఉత్పత్తిపై సింగరేణి యాజమాన్యం చూపు తున్న శ్రద్ధ సంస్థ మనుగడపై చూపడం లేదన్న ఆరో పణలున్నాయి. ఓ వైపు అండర్ గ్రౌండ్ గనులను క్ర మంగా మూసి వేస్తున్న యాజమాన్యం, వాటి స్థానం లో ఓపెన్‌కాస్టు గనులను తెరపైకి తెస్తోంది. జిల్లాలోని మూడు ఏరియాల్లో పెద్ద మొత్తంలో అండర్ గ్రౌండ్ గనులు ఇప్పటికే మూత పడగా, కొన్ని చోట్లా ఓసీల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికే ఆర్కే-6 అం డర్ గ్రౌండ్ మైన్ జూన్‌లో మూతపడగా, రామకృష్ణా పూర్ ఓపెన్‌కాస్టు గనిని కూడా మూసివేశారు. ఇక ఆర్కే-1, ఆర్కే న్యూటెక్, ఎస్‌ఆర్పీ-1, ఆర్కే-5 గనులు రాబోయే నాలుగైదేళ్ల కాలంలో మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఇవి మూతపడితే వాటిలో పనిచేసే కార్మికు లు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లకతప్పని పరిస్థితి నెలకొంటుంది. ఈ కారణంగా ఇక్కడి సింగరేణిఏరి యాల్లో కార్మికుల సంఖ్య మరింతగా తగ్గే అవకాశా లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మరో 40 సంవత్సరాల కు సరిపడా బొగ్గు నిల్వలు ఉండగానే యాజమాన్యం గనుల మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉండగా మందమర్రి ప్రాంతంలో కొత్తగా కేకే 6 అం డర్ గ్రౌండ్ మైన్, శ్రావణపల్లి ఓసీ గనులు వచ్చే అవ కాశాలున్నా యాజమాన్యం, ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల వాటి ఏర్పాటుకు మోక్షం లభించడం లేదు.
ఆర్కే ఓసీ జీవితకాలం పెరిగేనా...?
ఇదిలా ఉండగా రామకృష్ణాపూర్ ఓసీపీ జీవితకా లం పెంచే అవకాశాన్ని యాజమాన్యం పరిగణలోకి తీ సుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గని ఇప్ప టికే మూసివేతకు గురికాగా, దీనిని ఆనుకొని ఫేజ్-2 ప్రాజెక్టు ప్రారంభానికి సింగరేణి సన్నాహాలు చేస్తోంది. తద్వారా గని జీవితకాలం పెంచేందుకు చర్యలు చేప డుతోంది. స్థానికంగా మూసివేతకు గురైన భూగర్భ గ నులను కలుపుతూ ఆర్కే ఓసీ ఫేజ్-2 ఏర్పాటుకు సిం గరేణి కసరత్తు చేస్తోంది. 18 ఏళ్ల జీవితకాలం దా దా పు 40 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో ఓసీపీ ఏ ర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మూతప డిన ఆర్కే-4, ఆర్కే-3 భూగర్భ గనులతోపాటు ఆర్కే ఓసీపీని కలుపుకుంటూ ఫేజ్-2 నిర్మాణం జరుగనుంది. ఆర్కే కొత్త ఓసీపీ వస్తే రామకృష్ణాపూర్ పట్టణంలో మరో 20 ఏళ్లపాటు మనుగడ సాగించే వెసులుబాటు ఉంది. కొత్త ప్రాజెక్టుతో 500 మంది రెగ్యులర్ ఉద్యోగు లు, మరో 600 మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులకు జీవనోపాధి లభించనుందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. కొత్త ఓసీపీకి పర్యావరణ, మైనింగ్‌శాఖల అనుమతులతోపాటు ఫారెస్ట్ క్లియరెన్స్ రావలసి ఉన్న ట్లు తెలుస్తోంది. అనుమతులు రాగానే ఆర్కే ఫేజ్-2 ఏర్పాటుకు లైన్ క్లియర్ కానుంది.
షాఫ్ట్‌బ్లాక్ మైనింగ్‌తో మరింత మనుగడ...
సింగరేణి వ్యాప్తంగా ఓపెన్‌కాస్టు గనులలో ప్రస్తు తం 300 మీటర్ల లోనికి వెళ్లి బొగ్గును వెలికితీసే టె క్నాలజీ ఉంది. అయితే కొత్తగూడెంలో షాఫ్ట్ బ్లాక్ మై నింగ్‌తో 700 మీటర్ల వరకు లోనికి వెళ్లే వెసులుబా టు ఉంది. అదేమాదిరిగా ఇక్కడి ఓసీపీలను కూడా షాఫ్ట్‌బ్లాక్ మైన్స్‌గా ఆధునీకరిస్తే మరో 300 నుంచి 400 మీటర్ల వరకు అదనపు తవ్వకాలు జరిపే అవకా శం ఏర్పడుతుంది. ఆర్కే ఓసీని షాఫ్ట్‌బ్లాక్ మైన్‌గా ఆ దునీకరించాలనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే ఇం దారం, శ్రీరాంపూర్ ఓసీపీల సామర్థ్యం మరింతగా పెంచే అవకాశాలను యాజమాన్యం పరిగణలోకి తీసు కోవాలనే అభిప్రాయాలు ఉన్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ధృష్టిసారించాలి....
జిల్లాలోని మూడు సింగరేణి ఏరియాలలో నాలుగు దశాబ్దాలపాటు ఉపయోగపడేలా బొగ్గు నిక్షేపాలు ఉ న్నాయి. బొగ్గు ఉత్పత్తికి ఎలాంటి కొరతలేదు. కొత్తగా అండర్ గ్రౌండ్ మైన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఉ ద్యోగ నియామకాలు చేపట్టి బొగ్గు తవ్వకాలు జరపా ల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్త మవుతున్నాయి. ఈ దిశగా సింగరేణి యాజమాన్యం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కూడా సింగరేణి ఏరియాలలో నూతన గనులను ప్రారంభించడం ద్వా రా ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు కృషి చేయా ల్సిన అవసరం ఎంతైనా ఉంది.