Yadagirigutta: యాదగిరి క్షేత్రం.. భక్తజన సంద్రం
ABN , Publish Date - Aug 25 , 2025 | 04:55 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజనసంద్రమైంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆదివారం ఆలయ తిరువీధులు కిక్కిరిశాయి.
యాదగిరిగుట్ట, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తజనసంద్రమైంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆదివారం ఆలయ తిరువీధులు కిక్కిరిశాయి. 52 వేల మంది భక్తులు నృసింహుడిని దర్శించుకోగా, ప్రత్యేక, ధర్మదర్శనం క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో రద్దీ కొనసాగింది. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ. 55.16లక్షల ఆదాయం సమకూరినట్లు ఈవో ఎస్. వెంకట్రావు తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణోత్సవం కెనడాలో వైభవంగా జరిగింది. తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో విండ్‌సర్ నగరంలో స్వామిఅమ్మవార్ల కల్యాణాన్ని యాదగిరిగుట్ట ప్రధానాలయ విశ్రాంత ప్రధానార్చకుడు నల్లంథీఘళ్‌లక్ష్మీనరసింహచార్యులు నిర్వహించారు.