సూసైడ్ నోట్ రాసి.. బావిలో దూకి
ABN , Publish Date - May 19 , 2025 | 12:20 AM
వ్యవసాయ బావిలో దూకిన మహిళ సంఘటన యాదాద్రి జిల్లా ఆత్మ కూరు(ఎం) మండలకేంద్రంలో ఆదివారం జరిగింది.
వ్యవసాయ బావిలో దూకిన మహిళ
వ్యవసాయ బావి పక్కన దొరికిన సూసైడ్ నోట్
లభించని మృతదేహం
ఆత్మకూరు(ఎం) మే: 18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ బావిలో దూకిన మహిళ సంఘటన యాదాద్రి జిల్లా ఆత్మ కూరు(ఎం) మండలకేంద్రంలో ఆదివారం జరిగింది. ప్రత్యక్ష సాక్షి తోపాటు గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆత్మకూరు(ఎం) మండల మొరిపిరాల గ్రామానికి చెందిన కటికె సంధ్య(26) ఆదివారం మండల కేంద్రంలోని ఊరి దగ్గరలో ఉన్న వ్యవసాయ బావిలో దూకింది. దూకే టప్పుడు గట్టిగా రెండు మూడుసార్లు అరిచిందని, బావి నీటిలో నుంచి పెద్ద శబ్ధం వచ్చిందని బావి పక్కన మామిడి చెట్టు కింద కాయల కాపల పడుకున్న తుమ్మల నర్సింహ చెప్పాడు. వెం టనే ఊర్లోకి వెళ్లి విషయం చెప్పారు. వారు పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వ్యవసాయ బావి వద్ద పరిశీలించగా బావి ఒడ్డున చెప్పులు, కవరు దొరి కింది. కవరులో మహిళ ఆధారుకార్డుతోపాటు సూసైడ్ నోట్ రాసి ఉంది. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భార్యభర్తల మధ్య మనస్పర్థలు
మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన కటికె కృష్ణకు జనగామా జిల్లా రఘునాథ్‌పూర్‌మండలం కంచెనపల్లి గ్రామా నికి చెంది సంధ్యతో గత సంవత్సర క్రితం వివాహమైంది. భార్య భర్తలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కృష్ణ ప్రైవేట్ పాఠశాలలో పని చే స్తున్నాడు. మూడుమాసాల పాటు అన్యోన్యంగా ఉన్న వీరిమధ్య మన స్పర్థలు వచ్చాయి. పంచాయితీ పెద్దమనుషుల వరకు వెళ్లింది. సంధ్య భర్తను వదిలి పుట్టింటికి వెళ్లింది. భర్త తనను ఇబ్బంది పెడుతున్నాడని సంధ్య రఘునాథ్‌పూర్ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కృష్ణ ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వీరి పంచాయితీ కొనసాగుతున్న నేపథ్యంలో సంధ్య ఆత్మకూరులోని వ్యవసాయ బావిలో దూకింది. సంఘటన స్థలానికి చేరుకున్న మోత్కూరు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు.
సూసైడ్ నోట్‌లో..
వ్యవసాయ బావిలో దూకిన సంధ్య సూసై డ్ నోట్ రాసింది. తన భర్త కృష్ణ, అత్తమామలు కటికె మారమ్మ, రాములు, తోపాటు శ్రీను, రమ్య, కలిసి ఆత్మకూరు పోలీస్టేషన్‌లో తనపై దొంగతనం కేసు పెట్టి ఇబ్బంది పెట్టారని పేర్కొంది. ‘నేను దొంగతనం చేయలేదని చెప్పినా నాకు న్యాయం చేయాల్సిన ఆత్మకూరు(ఎం) పోలీసులు నా భర్త కృష్ణతో చేతు లు కలిపి నా జీవితాన్ని నాశనం చేశారు. భర్త కృష్ణ, అత్తమామలు మారమ్మ, రాములు వారికి సహకరించిన వారందరికీ శిక్ష పడాలని కోరుకుంటున్నా’ అని అని సంధ్య కాగితంపై రాసిపెట్టింది.