Writer Nellutla Ramadevi: రచయిత్రి, కాలమిస్టు.. రమాదేవికి కాళోజీ పురస్కారం
ABN , Publish Date - Sep 08 , 2025 | 02:22 AM
ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, కాలిమిస్టు నెల్లుట్ల రమాదేవి 2025కి గాను ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారానికి...
9న ప్రదానం.. సీఎం అభినందనలు
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, కాలిమిస్టు నెల్లుట్ల రమాదేవి 2025కి గాను ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. తెలం గాణ రాష్ట్ర గీత రచయిత అందె శ్రీ నేతృత్వంలోని కమిటీ రమాదేవిని ఈ ఏడాది పురస్కారానికి ఎంపిక చేసింది. సెప్టెంబరు 9న రవీంద్రభారతీలో జరిగే కాళోజీ జయంతి వేడుకల్లో రమాదేవికి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. కాగా, కాళోజీ పురస్కారానికి ఎంపికైన రమాదేవికి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.