Share News

కాళిమాతకు ఘనంగా పూజలు

ABN , Publish Date - Oct 21 , 2025 | 10:48 PM

మండలంలోని కాళి నగర్‌లో సోమవారం రాత్రి బెంగాళీ బక్తులు కాళిమాతకు ప్రత్యేక పూజల ను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి కాళిమాతను దర్శించుకోవ డానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.

కాళిమాతకు ఘనంగా పూజలు
కాళిమాతకు పూజలు చేస్తున్న భక్తులు

మందమర్రిరూరల్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కాళి నగర్‌లో సోమవారం రాత్రి బెంగాళీ బక్తులు కాళిమాతకు ప్రత్యేక పూజల ను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి కాళిమాతను దర్శించుకోవ డానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సోమవారం రాత్రి 12 గం టల నుంచి మొదలైన పూజలు మంగళవారం ఉదయం 8 గంటల వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బోడ ధర్మేందర్‌ మా ట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా కాళిమాత హారతి, మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రీ నారాణిదాస్‌, కాశీనాధ చటర్జీ, హర్దన్‌కర్‌, దేవ్‌చటర్జీ, రబీంద్రమండల్‌, ధనంజయ మండల్‌, సుజన్‌దాస్‌, అమిత్‌కార్‌, సంతోష్‌ మాలో పాల్గొన్నారు.

Updated Date - Oct 21 , 2025 | 10:48 PM