Share News

kumaram bheem asifabad- సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

ABN , Publish Date - Nov 08 , 2025 | 10:33 PM

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం గోలేటి టౌన్‌ షిప్‌లోని జీఎం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంరతం జీఎం విజయభాస్కర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

kumaram bheem asifabad- సమస్యలు పరిష్కరించాలని ఆందోళన
జీఎంకు వినతిపత్రం ఇస్తున్న ఏఐటీయూసీ నాయకులు

రెబ్బెన, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం గోలేటి టౌన్‌ షిప్‌లోని జీఎం కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంరతం జీఎం విజయభాస్కర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు తిరుపతి, భయ్య మొగిలి మాట్లాడుతూ కార్మికులకు మెడికల్‌ బోర్డు వెంటనే ఏర్పాటు చేసి పాత విధానంలోనే ఇన్వాలిడేషన్‌ ఇవ్వాలని, మెడికట్‌ ఫిట్‌ అయిన డిపెండెంట్లకు వెంటనే నియమక పత్రాలు ఇవ్వానలి, సింగరేణి ఉద్యోగులకు సొంత ఇల్లు పథకం అమలు చేయాలని, డిస్మిస్‌ అయిన ఉద్యోగులకు ఒక సారి మళ్లీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. 160 మాస్టర్లు చేయాలనే సర్క్యూలర్‌ను యాజమాన్యం రద్దు చేయాలని తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శేషశైనా రావు, రాజేష్‌, ఆనంద్‌, కిరణ్‌బాబు, ఓదేలు, అంజయ్య, ఆఫ్రిద్‌, సింహాద్రి, షకీల్‌, రారాజు, గోపాల్‌, రవికుమార్‌, రమేష్‌, రాజు, లక్ష్మినారాయణ, రమేష్‌, వెంకటేష్‌, అబ్దుల్‌ వాసీం, లవరాజు, అన్వేష్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎంఓఏఐ అధికారుల సంఘం ఆధ్వర్యంలో శనివారం జీఎం విజయభాస్కర్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. అధికారులందరికి జీతంలో భాగమైన పెర్పార్మెన్స్‌ రిలేటెడ్‌ పే 2022-23కు సంబంధించిన కోల్‌ ఇండియా జూన్‌ -2024లో చెల్లించారని అన్నారు. సింగరేణి సంస్థలో మాత్రం ఇప్పటి వరకు చెల్లింపు చేయక పోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పీఆర్పీ చెల్లింపుకు ఏర్పాటు చేయాలని కోరారు. సంస్థ పట్ల నిజాయితీగా పని చేస్తున్న అధికారులకు భరోసా కల్పించాలన్నారు. సంస్థ లక్ష్య సాధన దిశగా పూర్తి స్థాయిలో పని చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. పీఆర్పీ చెల్లించనట్లయితే ఈ నెల 24 నుంచి నిరాహర దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏఐ అధ్యక్షుడు నరేందర్‌, ఉపాధ్యక్షులు ఉజ్వల్‌కుమార్‌ బెహరా, రమేష్‌, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 08 , 2025 | 10:33 PM