Share News

kumaram bheem asifabad- కిశోర బాలికల సంక్షేమానికి కృషి

ABN , Publish Date - Jul 16 , 2025 | 11:18 PM

vఅంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, కిశోర బాలికల సంక్షేమానికి కృషి చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల, కార్పొరేట్‌ వ్యవహరాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో బుధవారం ప్రధాన మంత్రి జన్‌మన్‌ పథకం కింద రూ.19 లక్షలతో నిర్మించిన ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మిలతో కలిసి సందర్శించారు.

kumaram bheem asifabad- కిశోర బాలికల సంక్షేమానికి కృషి
కేంద్ర మంత్రి హర్ష మల్హోత్రాకు జ్ఞాపిక అందజేస్తున్న కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ఎమ్మెల్యే

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, కిశోర బాలికల సంక్షేమానికి కృషి చేస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల, కార్పొరేట్‌ వ్యవహరాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో బుధవారం ప్రధాన మంత్రి జన్‌మన్‌ పథకం కింద రూ.19 లక్షలతో నిర్మించిన ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఎమ్మెల్యే కోవ లక్ష్మిలతో కలిసి సందర్శించారు. కేంద్రంలో గర్భణులు, బాలింతలు, పిల్లలకు అందిస్తున్న పోషక ఆహారంపై సమీక్షించారు. పిల్లలతో అక్షరాభ్యాసం చేయించి వంటశాలను పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలు, టీచర్లు ఏకరూప దుస్తులు ధరించడంపై అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు సరైన సమయంలో పోషక ఆహారాన్ని అందించాలని చెప్పారు. బరువు, ఎత్తు తక్కువ ఉన్న పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులు ఆంగ్లంలో రాసిన కథలపై విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, ధ్రువపత్రాలు అందజేశారు. భారత్‌ ఎలకా్ట్రనిక్‌ లిమిటెడ్‌ సౌజన్యంతో అందించిన సంచార సైన్స్‌ ప్రయోగశాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్‌బాబు, కోవ లక్ష్మితో కలిసి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి సేవలు అందిస్తున్న డయాలసిస్‌ సెంటర్‌, ఆసుపత్రిలో వార్డులు సందర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలు ప్రిన్సిపాల్‌ శ్రీలక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్‌లో మంత్రిని సన్మానించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి నీరజ్‌కుమార్‌, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా సంక్షేమా ధికారి భాస్కర్‌, డీపీవో భిక్షపతి, డీఎంహెచ్‌వో సీతారాం తదితరులు పాల్గొన్నారు.

వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యం

ఆసిఫాబాద్‌రూరల్‌, (ఆంధ్రజ్యోతి): దేశంలో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా వెల్లడించారు. బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలంతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఝార్ఖండ్‌ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎంతో గొప్పగా అమలువుతున్నామయని చెప్పారు. దేశ వ్యాప్తంగా వెనకబడిర ప్రాంతాల్లో అలాగే అమలు చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం తాగునీరు అందించే లక్ష్యంగా ప్రధాన మంత్రి యోజనల పేరుతో వివిధ రకాల పథకాలు అమలు చేస్తున్నామన్నారు. దేశంలో 140 కోట్ల జనాభా సంక్షేమం లక్ష్యంగా పని చేస్తున్నామని వివరించారు. దేశంలోని అకాంక్షిత జిల్లాలోని ఒక్కో మంత్రి పర్యటించి పరిస్థితి తెలుసుకుంటున్నారని అన్నారు. దీనిలో భాగంగా జిల్లాకు వచ్చిన తనకు జిల్లా ప్రజలు ఇచ్చిన స్వాగతం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. జిల్లాలో నేషనల్‌ హైవే నిర్మించామని అన్నారు. అయితే ఇతర రోడ్లు అభివృద్ధి కావాల్సి ఉందని వాటికి కావాల్సిన అటవీ అనుమతులు వచ్చే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వన్‌నేషనల్‌ వన్‌ ఎలక్షన్‌ జిల్లా చైర్మన్‌ నాగేశ్వరరావు, జిల్లా నాయకులు విజయ్‌, మల్లికార్జున్‌ యాదవ్‌, విశాల్‌, ఆంజనేయులుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 11:18 PM