Share News

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:52 PM

గిరిజన ఆశ్రమ, వసతి గృహాలలో పనిచేస్తున్న రోజువారీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మంత్రికి వినతిపత్రం అందజేస్తున్న దినసరి కార్మికులు

కల్వకుర్తి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : గిరిజన ఆశ్రమ, వసతి గృహాలలో పనిచేస్తున్న రోజువారీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనుల శంకుస్థానకు వెళుతున్న మంత్రి కల్వకుర్తి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నిరవధిక దీక్ష చేస్తున్న కార్మికులు అక్కడ మంత్రిని కలిసి తమను పర్మినెంట్‌ చేయాలని, కలెక్టర్‌ గెజిట్‌ ప్రకారం వేతనాలు చెల్లించాలని, రిటెర్మెంట్‌ బెనిఫిట్స్‌ అందించాలని వినతిపత్రంలో కోరారు. కార్యక్రమంలో సీపీఐ తాలూకా అధ్యక్షుడు పులిజాల పరశురామలు, ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మబ్బుసాయన్నమాదిగ, నాయకులు మల్లేష్‌, వర్కర్లు అలివేల, పద్మ, బుజ్జి, యాదమ్మ, బాలకిష్టమ్మ, నర్సమ్మ, జానకమ్మ, నీల, రుక్నమ్మ, ఖాజాబీ, రవి ఉన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 11:52 PM