Share News

kumaram bheem asifabad- గెలుపే లక్ష్యంగా పని చేయాలి

ABN , Publish Date - Jul 23 , 2025 | 11:20 PM

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఐక్యంగా పని చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని బీజేపీ పార్ట కార్యకర్తలతో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్యకర్త నుంచి ఎన్నికల్లో వార్డు సభ్యుల నుంచి మొదలుకొని సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ వరకు గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశనం చేశారు.

kumaram bheem asifabad- గెలుపే లక్ష్యంగా పని చేయాలి

పెంచికలపేట, జూలై 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఐక్యంగా పని చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని బీజేపీ పార్ట కార్యకర్తలతో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ కార్యకర్త నుంచి ఎన్నికల్లో వార్డు సభ్యుల నుంచి మొదలుకొని సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ వరకు గెలుపే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశనం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకాన్ని గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ మండల కేంద్రంలోని రైతు వేదికలో 33 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కల్యాణలక్ష్మితో పాటు సీఎంఆర్‌ఎఫ్‌ కూడా సద్వినియోగం చేసుకోవాలని అ న్నారు. ఎడ తెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉం డాలన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పుష్పలత, ఏవో మనీషా, నాయకుల రాజేశ్వర్‌, సత్యనారాయణ, నాగేష్‌, గణ పతి, పురుషోత్తం, భుజంగరావు, శోభన్‌, శ్రీకాంత్‌, హరీష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

దహెగాం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలనే సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్యే పాల్వాయిహరీష్‌ బాబు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎడర తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంఇ సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకు రావాలన్నారు. కోత్మీర్‌- దహెగాం డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన చేపడుతుండడంతో చర్యలకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, అదే విధంగా బొప్పరం గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లు పూర్తి అయ్యాయని త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. దహెగాం మండలంలో 51 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ మునావర్‌ షరీఫ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపతిగౌడ్‌, వైస్‌ చైర్మన్‌ ధనుంజయ్‌, నాయకులు ప్రభాకర్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 11:20 PM