kumaram bheem asifabad- జీసీసీ అభివృద్ధికి కృషి చేయా
ABN , Publish Date - Nov 28 , 2025 | 10:21 PM
గిరిజన సహకార సంస్థ(జీసీసీ) అభివృద్ధికి కృషి చేయాలని జీసీసీ ఉట్నూరు డివిజనల్ మేనేజర్ గుడిమల్ల సందీప్‌కుమార్ అన్నారు. కాగజ్‌నగర్‌లోని జీసీసీ సోసైటీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. జీసీసీ తరుపున గిరిజన ప్రాంతంలో ఉన్న డీఆర్‌డీపోలను బలోపేతం చేసి, బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకే అందించాలని చెప్పారు.
కాగజ్‌నగర్, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): గిరిజన సహకార సంస్థ(జీసీసీ) అభివృద్ధికి కృషి చేయాలని జీసీసీ ఉట్నూరు డివిజనల్ మేనేజర్ గుడిమల్ల సందీప్‌కుమార్ అన్నారు. కాగజ్‌నగర్‌లోని జీసీసీ సోసైటీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. జీసీసీ తరుపున గిరిజన ప్రాంతంలో ఉన్న డీఆర్‌డీపోలను బలోపేతం చేసి, బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకే అందించాలని చెప్పారు. అవసరమైన చోట కొత్త భవనాలు నిర్మించాలన్నారు. ధాన్యం, కందులు, మొక్కజొన్న, సోయావంటి పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌బంకును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మేనేజర్ మనోహర్, అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ హేమలత, సిబ్బంది చందు, ప్రదీప్, కిష్టు, సత్యం, ప్రవీణ్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, (ఆంధ్రజ్యోతి) జీసీసీ అభివృద్దికి కృషి చేయాలని గిరిజన సహకార సంస్థ ఊట్నూర్ డివిజనల్ మేనేజర్ సందీప్‌కుమార్ అన్నారు. ఆసిఫాబాద్ జీసీసీ సొసైటీ సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జీసీసీని అభివృద్ది చేసేందుకు సిబ్బంది, డైరెక్టర్లు కృషి చేయాలన్నారు. జీసీసీ తరపున మారుమూల గిరిజన ప్రాంతాలలో ఉన్న డీఆర్‌డీపోలను బలోపేతం చేసి బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచిచారు. అవసరమైన చోట కొత్త భవనాలు నిర్మించాలని, ధాన్యం, కందులు, మొక్కజొన్న, సోయా వంటి పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సభ్యులు తీర్మానిచారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో గోవింద్‌చంద్ సర్థార్, సొసైటీ అకౌంటెంట్ సదాశివ్, అసిస్టెంట్ రిజిస్టార్లు శామ్యూల్ మాథ్యూస్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.