Share News

kumaram bheem asifabad- సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Nov 22 , 2025 | 10:48 PM

గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని టీఎస్‌టీడబ్ల్యూటీయూ జిల్లా అధ్యక్షుడు రాథోడ్‌ రవీందర్‌ అన్నారు. జైనూర్‌ డివిజన్‌లోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో శనివారం టీఎస్‌టీడబ్ల్యూటీయూ సభ్యత్వ నమోదు చేశారు.

kumaram bheem asifabad- సమస్యల పరిష్కారానికి కృషి
రాసిమెట్ట ఆశ్రమోన్నత పాఠశాలలో సభ్యత్వ నమోదు చేపడుతున్న నాయకులు

జైనూర్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని టీఎస్‌టీడబ్ల్యూటీయూ జిల్లా అధ్యక్షుడు రాథోడ్‌ రవీందర్‌ అన్నారు. జైనూర్‌ డివిజన్‌లోని గిరిజన సంక్షేమ పాఠశాలల్లో శనివారం టీఎస్‌టీడబ్ల్యూటీయూ సభ్యత్వ నమోదు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా నిరంతం కృషి చేస్తుందన్నారు. జిల్లా మహిళా కార్యదర్శి దుర్వ శైలజ మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయులు వంద శాతం మాతృ సంఘంలో సభ్యత్వాలు నమోదు చేసుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కోశాధికారి కుడిమెత అనంత్‌, రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉయిక శంకర్‌, సభ్యులు చాహకటి శ్యాంరావ్‌, ప్రేందాస్‌, లక్ష్మి, పంచపూల, లక్ష్మీనారాయణ, మోహన్‌, అనిత, గజానంద్‌, గణపత్‌, విజేందర్‌, ఘాగృ, బుచ్చిరాం, పార్తిరాం, గణపత్‌ తదితరులు పాల్గొన్నారు.

లింగాపూర్‌, (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయమని టీఎస్‌టీడబ్ల్యూటీయూ జిల్లా అధ్యక్షుడు రాథోడ్‌ రవీందర్‌ అన్నారు. సంఘం జిల్లా కమిటీ సభ్యులతో మండలంలోని పాఠశాలల్లో సభ్యత్వ నమోదు చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కోశాధికారి కుడిమెత అనంత్‌ పార్వతి, వసంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలోని మోడి, హట్ట, అనార్‌పల్లి గ్రామాల్లో శనివారం టీఎస్‌టీడబ్ల్యూటీయూ సభ్యత్వ నమోదు చేపట్టారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 10:48 PM