Share News

పరిహారం ఇచ్చాకే పనులు ప్రారంభించాలి

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:24 AM

బైపాస్‌ విస్తరణలో సర్వే చేయించి భూములు కోల్పోయే వారికి నష్టపరిహారం ఇచ్చాకే రోడ్డు పనులు ప్రారంభించాలని భూనిర్వాసితుల పోరాట కమిటీ గౌరవ అధ్యక్షుడు సయ్యద్‌ హాషం, కో కన్వీనర్లు నాగార్జునరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

పరిహారం ఇచ్చాకే పనులు ప్రారంభించాలి
బాధితులతో మాట్లాడుతున్న అధికారి

నల్లగొండ రూరల్‌, జూలై 19(ఆంధ్రజ్యోతి): బైపాస్‌ విస్తరణలో సర్వే చేయించి భూములు కోల్పోయే వారికి నష్టపరిహారం ఇచ్చాకే రోడ్డు పనులు ప్రారంభించాలని భూనిర్వాసితుల పోరాట కమిటీ గౌరవ అధ్యక్షుడు సయ్యద్‌ హాషం, కో కన్వీనర్లు నాగార్జునరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణం గిరకబాయిగూడెంలోని జాతీయ రహదారి కాంట్రాక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ పరిధిలో 14కిలోమీటర్ల విస్తరణలో 1250 మంది నిర్వాసితులు ఉన్నారని గుర్తించామని తెలిపారు. మంత్రులు కలగజేసుకొని వారందరికీ నష్టపరిహారం అందించేలా చూడాలన్నారు. అప్పటి వరకు రోడ్డు నిలిపి వేయాలన్నారు డిమాండ్‌ చేశారు. బాధితులు విలువైన భూములు కోల్పోతారని తెలిపారు. ఆ భూముల్లో పంటలు కూడా వేశారని వాటికి కూడా నష్టపరిమారం ఇవ్వాలన్నారు. కార్యాలయ మేనేజర్‌ సత్యం మాట్లాడుతూ రైతులందరికీ నష్టపరిహారం చెల్లించిన తర్వాత, రైతుల అనుమతితోనే రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తామన్నారు. అంతవరకు ఏ రైతు భూమిలో కూడా రోడ్డు వేయబోమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ గౌరవ సలహాదారుడు దండెంపల్లి సత్తయ్య, మాజీ కౌన్సిలర్‌ ఊట్కూరి వెంకట్‌రెడ్డి, కోశాధికారి కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 12:25 AM