kumaram bheem asifabad- పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 10:54 PM
నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పనులన లబ్ధిదారులు వేగవేంతంగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం మండల పరిషత్ అధికారులు, ఎంపీవోలు, ఏపీవోలు, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఆసిఫాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పనులన లబ్ధిదారులు వేగవేంతంగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి బుధవారం మండల పరిషత్ అధికారులు, ఎంపీవోలు, ఏపీవోలు, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ప్రధాన మంత్రి జన్ మన్ పథకం కింద పీవీటీజీలకు మంజూరు చేసిన ఇళ్ల పనులను వంద శాతం ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ఇందరిమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా అందిస్తుందని చెప్పారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని లబ్ధిదారులు ఇసుకను వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఇంటి పనులకు వంద శాతం వసూలు చేసిన గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని, ఇళ్ల యజమానులకు డిమాండ్ నోటీసులు జారీ చేసి ఇంటి పన్నులు వసూలు చేయాలని సూచించారు. సెర్ప్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఏకరూప చీరల పంపిణీకి కార్యచరణ రూపొందించాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు పనులు కల్పించేందుకు పని ప్రదేశాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రకాష్‌రావు తదితరులు పాల్గొన్నారు.