kumaram bheem asifabad- పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:29 PM
ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పనులను లబ్ధిదారులు 45 రోజుల లోపు ప్రారంభించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మొదటి విడతలో మంజూరయిన 70 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బుధవారం మంజూరు పత్రాలను అందజేశారు.
సిర్పూర్(టి), అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పనులను లబ్ధిదారులు 45 రోజుల లోపు ప్రారంభించాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మొదటి విడతలో మంజూరయిన 70 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బుధవారం మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లు మంజూరయిన ప్రతి లబ్ధిదారుడు పనులు ప్రారంభించాలని చెప్పారు. లేని పక్షంలో మంజూరు పత్రాలు రద్దు అయి ఇతరులు అర్హులైన వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం రూ.3 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షలు ఇస్తుందన్నారు. అనంతరం ఎంపీడీవో ఆవరణలో గతంలో నిర్మించిన నమునా భవనంకు మరమ్మతులు చేసి గ్రంథాలయంను ప్రారంభించారు. మండల కేంద్రంలో గ్రంథాలయం లేక పోవడంతో పాఠకుల సౌకర్యార్థం గ్రంథాలయంను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం లోనవెల్లి గ్రామంలో ఉపాఽధిహామీ పథకం కింద మంజూరు రూ.30 లక్షలతో లోనవెల్లి నుంచి పెన్‌గంగా వరకు, పారిగాం నుంచి పెన్‌గంగా వరకు రోడ్లు నిర్మాణ పనులను ప్రారం భించారు. గ్రామానికి చెందిన బుద్ద బాలకిషన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ఎంపీడీవో సత్యనారాయణ, ఏఈ సజీయోద్దీన్, ఈవో తిరుపతి, బీజేపీ నాయకులు లావణ్య, అశోక్, ఆశోక్ ఆర్యా, సాయి, ప్రశాంత్, విలాస్, బాలాజీ, సత్యనారాయణ, శంకర్, మారుతి పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం దృష్టికి జాతీయ రహదారి పనుల విషయాన్ని తీసుకెళ్లామని ఎమ్మెల్యే హరీష్‌బాబు అన్నారు. కాగజ్‌నగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రిత్‌మిలన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కాగజ్‌నగర్ పట్టణ అభివృద్ధి కోసం కాగజ్‌నగర్ నుంచి నాగ్‌పూర్ వరకు నాలుగు వరసల జాతీయ రహదారి పనులకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. నిధులు విడుదల కాగానే పనులు ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.