Share News

పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:57 PM

ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సౌకర్యార్ధం చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం మండలంలోని కిష్టం పేట గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి కళాశాల పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు.

పనులను వేగవంతం చేయాలి
చెన్నూరులో అధికారులకు సూచనలు ఇస్తున్న జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

-జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సౌకర్యార్ధం చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం మండలంలోని కిష్టం పేట గ్రామంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి కళాశాల పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేసి విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుం టుందన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన అభివృద్థి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం చెన్నూరులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచన లు చేశారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసేలా పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం చె న్నూరు పట్టణంలోని కొనసాగుతున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను పరిశీలిం చి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకుమెరుగైన సేవలందించేందుకు ఆరోగ్య కేం ద్రం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే అమృత్‌ 2.0 పథకం కింద చేపట్టిన వాటర్‌ ట్యాంకు నిర్మా ణపనులను పరిశీలించారు. నీటి ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికి సరిపడ నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మోహన్‌, మున్సిపల్‌ కమి షనర్‌ మురళీ కృష్ణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 11:57 PM