kumaram bheem asifabad- పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jul 05 , 2025 | 10:53 PM
జిల్లాలో చేపట్టిన మహిళా శక్తి భవన్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న జిల్లా మహిళా శక్తి భవనం పనులను శనివారం పంచాయతీ రాజ్ ఈఈ అజ్మీర కృష్ణతో కలిసి కలెక్టర్ పరిశీలించారు
ఆసిఫాబాద్‌రూరల్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన మహిళా శక్తి భవన్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న జిల్లా మహిళా శక్తి భవనం పనులను శనివారం పంచాయతీ రాజ్ ఈఈ అజ్మీర కృష్ణతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. రూ.5 కోట్ల ప్రత్యేక నిధులతో భవన పనులను ప్రారంభించామన్నారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అక్టోబరు నెల చివరి వారంలోగా పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. పనులలో నాణ్యత ఉండేలా ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో గల ఆర్‌ఆర్ కాలనీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. పనులు వేగంతం చేయాలని, బేసిమెంట్ వరకు పూర్తి చేసుకున్న వారి వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. దీంతో ప్రతి సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గజానంద్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.