kumaram bheem asifabad- పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Oct 14 , 2025 | 10:22 PM
పాఠశాలలో అదనపు తరగతి గదుల పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు అదనపు తరగతి మంజురు అయిందని పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేయలని అధికారులను ఆయన ఆదేశించారు.
సిర్పూర్(యు), అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): పాఠశాలలో అదనపు తరగతి గదుల పనులు త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలను మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు అదనపు తరగతి మంజురు అయిందని పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేయలని అధికారులను ఆయన ఆదేశించారు. నూతన భవన నిర్మాణం కావాల్సిన స్థలాని పరిశీలించారు. పాఠశాలలో తాగు నీటి సమస్యపై అధికారులను ఆడిగి తెలుకున్నారు. తాగు నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంపీడీవో కృష్ణారావును ఆదేశించారు. తాగు నీటికు విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సిర్పూర్(యు), లింగాపూర్ కేజీబీవీ పాఠశాలలలో ఉన్న నీటీ సమస్యను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదిలో కుర్చుని విద్యార్థులకు బోధస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థులకు పాఠలు బోధించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, ఎంఈవో కుడ్మేత సుధాకర్, మాజీ ఎంపీపీ ఆత్రం దౌలత్‌రావు, మాజీ ఎంపీటీసీ ఆత్రం గోవింద్‌రావు, మాజీ సర్పంచ్ ఆర్క నాగోరావు, జేఈ శశిధర్, నాయకులు ఆత్రం నాగోరావు,సిడం సుబాష్, ఉపాధ్యాయుడు భూమన్న తదితరులు పాల్గొన్నారు.