Share News

నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - Oct 16 , 2025 | 11:02 PM

జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. కిష్టంపేటలో చేపట్టిన డిగ్రీ కళాశాల అద నపు గదుల నిర్మాణాన్ని ఎంపీడీవో మోహన్‌తో కలిసి గురువారం పరిశీలించా రు. పనుల్లో నాణ్యమైన సిమెంట్‌, ఇసుక వాడాలని సూచించారు.

నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలి
చెన్నూరులో అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న జిలల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

చెన్నూరు, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి) జిల్లాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవా లని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. కిష్టంపేటలో చేపట్టిన డిగ్రీ కళాశాల అద నపు గదుల నిర్మాణాన్ని ఎంపీడీవో మోహన్‌తో కలిసి గురువారం పరిశీలించా రు. పనుల్లో నాణ్యమైన సిమెంట్‌, ఇసుక వాడాలని సూచించారు. ఆశ్రమ బా లుర పాఠశాల, సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించి అక్కడి పనులను ము న్సిపల్‌ కమిషనర్‌ మురళికృష్ణతో కలిసి పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యుత్‌ సౌకర్యం, మూత్రశాలలు, భోజన శాలల నిర్మాణం చేపడుతుందన్నారు. ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందు కు అమృత్‌ 2.0 పథకం ద్వారా నీటి ట్యాంకులు నిర్మించి తాగునీరు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం పీహెచ్‌సీ భవన నిర్మాణం పనులను పరిశీ లించారు. కలెక్టర్‌ వెంట స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 11:02 PM